Twitter: ట్విటర్‌లో మరో రెండు కొత్త ఫీచర్లు.. వెల్లడించిన మస్క్‌!

ట్విటర్‌ (Twitter)లో వచ్చే వారంలో మరో రెండు కొత్త ఫీచర్లను పరిచయం చేయనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు మస్క్‌కు థాంక్స్‌ చెబుతూ కామెంట్లు చేస్తున్నారు.

Published : 22 May 2023 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ (Twitter)ను ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొనుగోలు చేసిన తర్వాత అందులో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలోనే ఇతర యాప్‌లకు భిన్నంగా ఉండేందుకు కొత్త ఫీచర్లను పరిచయం చేస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త ఫీచర్లను వచ్చే వారంలో పరిచయం చేయనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన చేసిన ట్వీట్‌లో కొత్త ఫీచర్ల గురించి చెప్పారు. 

జెస్సి డాగెర్టీ అనే నెటిజన్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేసే వీడియోలకు 15 సెకన్ల ఫార్వార్డ్‌, బ్యాక్‌ బటన్లను యాడ్ చేయాలని మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్వీట్  చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించిన మస్క్..‘‘ వచ్చే వారంలో పిక్‌-ఇన్‌- పిక్‌ మోడ్‌తోపాటు వీడియో ఫార్వార్డ్‌, బ్యాక్‌ బటన్లు వస్తాయి’’ అని ట్వీట్ చేశారు. పిక్‌-ఇన్‌-పిక్‌ మోడ్‌ సాయంతో యూట్యూబ్‌ తరహాలో యూజర్లు చిన్న విండోలో వీడియోను చూస్తూ.. వెబ్‌ పేజ్‌లో తమ పనిని కొనసాగించవచ్చు. అలానే ఫార్వార్డ్‌, బ్యాక్‌ బటన్స్‌తో వీడియోను ముందు, వెనకకు జరపవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్లు వాట్సాప్‌, యూట్యూబ్‌ వంటి యాప్స్‌లో అందుబాటులో ఉన్నాయి. వచ్చే వారం నుంచి ట్విటర్‌ యూజర్లకు సైతం పరిచయం కానున్నాయి.

మస్క్‌ ట్వీట్ చూసిన నెటిజన్లు ఈ ఫీచర్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నాం.. వీటిని పరిచయం చేస్తున్నందుకు థాంక్స్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. గతేడాది ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి మస్క్‌ సీఈవోగా వ్యవహరించారు. ఇటీవలే లిండా యాకరినోను ట్విటర్‌ సీఈవోగా నియమించారు. ఆమె ప్రత్యేకంగా బిజినెస్స్‌ ఆపరేషన్స్‌పై దృష్టి పెడతారని మస్క్‌ ప్రకటించారు. అలానే ప్రొడక్ట్‌ డిజైన్‌, కొత్త టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాలను తాను చూసుకుంటానని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని