Elon Musk: ‘కష్టకాలం ముందుంది.. సిద్ధంకండి’ ట్విటర్‌ ఉద్యోగులకు మస్క్ లేఖ

ట్విటర్‌లో వర్క్‌ఫ్రమ్‌ హెమ్‌ ముగిసినట్లేనని ఉద్యోగులకు రాసిన లేఖలో మస్క్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ట్విటర్‌ ఎన్నో ప్రయోగాలు చేస్తుందని.. వాటిలో అవసరమైన వాటిని ఉంచి, అనవరమైనవి తొలగిస్తామని ట్వీట్ చేశారు. 

Published : 11 Nov 2022 01:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ట్విటర్‌ కొనుగోలు చేసిన తర్వాత తొలిసారి ఎలాన్‌ మస్క్‌ సంస్థ ఉద్యోగులకు లేఖ రాశారు. గడ్డుకాలాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన ఉద్యోగులకు పంపిన మెయిల్‌లో కోరారు. ట్విటర్‌ ఆర్థిక పరిస్థితి గురించి ఆయన లేఖలో ఉద్యోగులకు వివరించారు. ‘‘నేను పంపిన మెసేజ్‌లో తీపికబురు లేదు. క్లిష్టమైన పరిస్థితులు ముందున్నాయి. ఎదుర్కొనేందుకు సిద్ధంకండి’’ అని కోరినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తన కథనంలో పేర్కొంది.  వర్క్‌ఫ్రం హోమ్ పద్ధతి ముగిసిందని, ఉద్యోగులు తప్పనిసరిగా వారంలో 40 గంటలు ఆఫీసు నుంచి పనిచేయాలని ఆదేశించారు. ఇకపై  ఇంటి నుంచి పనిచేయాలంటే తన అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఉద్యోగులకు సూచించారు. మస్క్‌ ట్విటర్‌ బాధ్యతలు చేపట్టి రెండు వారాలు పూర్తైన సందర్బంగా ఆయన ఉద్యోగులకు ఈ-మెయిల్ సందేశాన్ని పంపారు. 

ట్విటర్‌ పగ్గాలు చేపట్టిన తర్వాత మస్క్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ట్విటర్‌ ఖాతాల బ్లూ టిక్‌ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. దీనివల్ల ట్విటర్‌ రెవెన్యూలో సగం సబ్‌స్క్రిప్షన్‌ ద్వారా పొందాలనేది తన ఆలోచనగా మస్క్‌ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు సంస్థలో సగానికిపైగా  ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. అయితే, మస్క్‌ బ్లూ టిక్‌ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నకిలీ ఖాతాదారులు కూడా 8 డాలర్లు చెల్లించి వెరిఫైడ్‌ బ్యాడ్జ్‌ పొందే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో  ఖాతాలకు అధికారిక (Official) అనే ట్యాగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలానే రాబోయే రోజుల్లో ట్విటర్‌ ఎన్నో ప్రయోగాలు చేస్తుంది. వాటిలో అవసరమైన వాటిని ఉంచి, అనవరమైనవి తొలగిస్తామని మస్క్‌ ట్వీట్ చేశారు.  

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని