Jobs: నవంబర్‌లో నియామకాల జోరు.. ఏ రంగంలో ఎంత శాతమంటే?

ఇంటర్నట్‌ డెస్క్‌: ఇటీవల క్రయవిక్రయాలు పెరగడం, విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమవడం.. పండుగ సీజన్ల నేపథ్యంలో నవంబర్‌ నెలలో దేశవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు సరాసరి 26% పెరిగాయని ప్రముఖ జాబ్‌ పోర్టల్‌ నౌకరీ సంస్థ వెల్లడించింది. నవంబర్‌ నెలకు సంబంధించిన నౌకరీ జాబ్‌ స్పీక్‌ ఇండెక్స్‌లో నియామకాల పాయింట్లు 2,173 వద్ద ట్రెండ్‌ అవుతున్నాయి. అదే నియామకాల పాయింట్లు గతేడాది నవంబర్‌లో 1,727గా ఉన్నట్లు సంస్థ పేర్కొంది.

నౌకరీ సంస్థ నివేదిక ప్రకారం.. గతేడాది నవంబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది నవంబర్‌లో రిటైల్‌ రంగంలో నియామకాలు 47% పెరిగాయి. ఆతిథ్య.. పర్యటక రంగంలో 58%, విద్యాసంస్థలు ప్రారంభమవడంతో విద్యారంగంలో 54% నియామకాలు పెరిగాయి. అలాగే, బ్యాంకింగ్‌/ఫైనాన్సింగ్‌ రంగంలో 30%, ఐటీ రంగంలో 50%, ఆహార ఉత్పత్తుల రంగంలో 6%, ఆరోగ్య రంగంలో 3% నియామకాలు పెరిగినట్లు సంస్థ చెబుతోంది.

మెట్రో సిటీలో అలా.. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఇలా..

మెట్రో సిటీల్లో నియామకాల జోరు కొనసాగుతూనే ఉండగా.. ద్వితీయ శ్రేణి నగరాల్లో నియామకాలు స్వల్పంగానే ఉన్నాయి. బెంగళూరులో 49%, హైదరాబాద్‌.. పుణెలో 47%, ముంబయిలో 36%, చెన్నైలో 35%, దిల్లీలో 34%, కోల్‌కతాలో 23% పెరిగినట్లు నౌకరీ నివేదికలో తేలింది. మెట్రో నగరాల్లో నియామకాలు సరాసరి 39శాతంగా ఉండగా.. ద్వితీయశ్రేణి నగరాల విషయానికొస్తే.. ఇది 16శాతంగా ఉంది. నాన్ మెట్రో నగరాల్లో అత్యధికంగా 61శాతంతో అహ్మదాబాద్‌ నిలవగా.. ఆ తర్వాత స్థానంలో 28శాతంతో కోయంబత్తూరులో నిలిచింది.

వృత్తిపరమైన అనుభవజ్ఞులకూ డిమాండ్‌

వృత్తిపరమైన అనుభవం ఉన్న వ్యక్తులకు సంబంధించిన నియామకాలు కూడా నవంబర్‌లో జోరుగా సాగాయి. 8 నుంచి 12 ఏళ్ల వృత్తి అనుభవం ఉన్న వ్యక్తుల నియామకాలే అత్యధికంగా(37%) జరిగాయి. ఆ తర్వాత 4-7 ఏళ్ల అనుభవజ్ఞులు(30%), 0-3 ఏళ్ల అనుభవజ్ఞులు(27%), 13-16 ఏళ్ల అనుభవజ్ఞులు (26%), 16ఏళ్లకు మించిన అనుభవం ఉన్నవారి నియామకాలు 20% మేర పెరిగినట్లు తెలుస్తోంది.

Read latest Business News and Telugu News

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్