ఈపీఎఫ్ బ్యాలన్స్, వడ్డీ ఎలా లెక్కిస్తారో తెలుసా?

ఉద్యోగి, ప‌నిచేస్తున్న సంస్థ ఇద్ద‌రూ క‌లిపి చేసే కాంట్రిబ్యూషన్ పై ఈపీఎఫ్ వడ్డీని లెక్కిస్తారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈపీఎఫ్ కి సంబంధించిన లెక్క‌ - బేసిక్, డి.ఏ కలిపి రూ. 15,000 కంటే తక్కువ ఉన్నట్లయితే ఉద్యోగి....

Updated : 02 Jan 2021 17:26 IST

ఉద్యోగి, ప‌నిచేస్తున్న సంస్థ ఇద్ద‌రూ క‌లిపి చేసే కాంట్రిబ్యూషన్ పై ఈపీఎఫ్ వడ్డీని లెక్కిస్తారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఈపీఎఫ్‌కి సంబంధించిన లెక్క‌ - బేసిక్, డి.ఏ కలిపి రూ. 15,000 కంటే తక్కువ ఉన్నట్లయితే ఉద్యోగి వాటా (బేసిక్ + డి.ఏ) 12 శాతం, సంస్థ వాటా 3.67 శాతం గా ఉంటుంది. ఈపీఎస్ లో సంస్థ 8.33 శాతం వేరేగా కేటాయింపు చేస్తుంది. ఉద్యోగి బేసిక్, డి.ఏ కలిపి రూ. 15,000 దాటితే లెక్క ఇలా వేయోచ్చు. ఉద్యోగి (బేసిక్ + డి.ఏ) రూ. 25,000 అనుకుందాం.

  1. ఈపీఎఫ్ లో ఉద్యోగి వాటా: 12% * 25,000 = రూ. 3,000

  2. ఈపీఎఫ్ లో సంస్థ వాటా: 3.67% * 25,000 = రూ. 917.50 (A)

  1. ఉద్యోగి ఆదాయం ప్రకారం ఈపీఎస్ లో సంస్థ వాటా: 8.33% * 25,000 = రూ. 2082.50 (1)

  2. రూ.15,000 లిమిట్ ప్రకారం ఈపీఎస్ లో సంస్థ వాటా: 8.33% * 15,000 = రూ. 1250 (2)

  3. ఈపీఎస్ లో లిమిట్ దాటిన సంస్థ వాటా (1) - (2) = రూ. 2082.50 - రూ. 1250 = రూ. 832.50 (B)

  4. ఈపీఎస్ లో లిమిట్ దాటిన సంస్థ వాటాని ఈపీఎఫ్ లో జత చేస్తారు. ఈ ప్రకారం ఈపీఎఫ్ లో సంస్థ వాటా (A) + (B) = రూ. 917.50 + రూ. 832.50 = రూ. 1750 గా మారుతుంది.

ఉద్యోగి, సంస్థ వాటా గురించి తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దానిపై వడ్డీ లెక్కింపు పద్ధతి చూద్దాం. ప్రతీ నెలా మొదటి తారీకున ఉన్న బ్యాలన్స్ పై వడ్డీని లెక్కిస్తారు. మొదటి నెల బ్యాలన్స్ సున్నా కాబట్టి వడ్డీ కూడా సున్నానే. రెండో నెలకొచ్చేసరికి మొదటి నెల చివరి తేదీలో ఉండే బ్యాలన్స్ పై వడ్డీ లెక్కిస్తారు. ఉద్యోగి, సంస్థ వాటాలు కలిసాక వచ్చే బ్యాలన్స్ ఇది. అదే విధంగా మూడో నెలకు కూడా మొదటి రెండు నెలల వాటాలు కలిపి బ్యాలన్స్ వడ్డీ లెక్కిస్తారు.

ఈ విధంగా సంవత్సరం చివరికి ఉద్యోగి, సంస్థల వాటాలు, వడ్డీలు కలుపుతారు. దీన్నే మనం ఈపీఎఫ్ క్లోసింగ్ బ్యాలన్స్ అని కూడా అంటాం. ఇదే రెండో సంవత్సరానికి ఓపెనింగ్ బ్యాలన్స్ గా మారుతుంది, రెండో సంవత్సరం మొదటి నెలలో దీనిపై వడ్డీ లెక్కిస్తారు.

PF-TABLE.png

(అంచ‌నా 9 శాతం చొప్పున‌)

సంవత్సరం చివరికి మొత్తం ఈపీఎఫ్ బ్యాలన్స్ = పన్నెండవ నెల తరవాత ఉండే ఈపీఎఫ్ బ్యాలన్స్ + మొత్తం ఈపీఎఫ్ వడ్డీ = 57,000 + 2351 = రూ. 59,351

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని