EPF e-passbook: ఈపీఎఫ్‌లో అదే సీన్‌.. అందుబాటులోకి రాని ఇ-పాస్‌బుక్‌ సేవలు!

EPF e-passbook: ఈపీఎఫ్‌ ఇ-పాస్‌బుక్‌ సేవలు కొన్ని రోజులుగా నిలిచిపోయాయి. దీంతో చందాదారులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

Updated : 16 Jan 2023 16:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తమ చందాదారులకు చుక్కలు చూపిస్తోంది. పది రోజుల నుంచి ఈపీఎఫ్‌ ఇ-పాస్‌బుక్‌ (EPF e-passbook) సేవలు నిలిచిపోవడంతో చందాదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లోని ఇ-పాస్‌ బుక్‌ విభాగానికి వెళ్లినప్పుడు సాయంత్రం 5 గంటల తర్వాత సేవలు అందుబాటులోకి వస్తాయని చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే సందేశం కనిపిస్తుండడంపై చందాదారులు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సోమవారం మధ్యాహ్నం సైతం ఆ పోర్టల్‌లో అదే సందేశం కనిపిస్తోంది.

గతేడాది సైతం కొన్నిరోజుల పాటు ఇ-పాస్‌బుక్‌ సేవల్లో అంతరాయం ఏర్పడింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ జమ అయినట్లు పాస్‌బుక్‌లో చూపించకపోవడంపై నెటిజన్లు ప్రశ్నించారు. అయితే, సాఫ్ట్‌వేర్‌ అప్‌గ్రేడ్‌ కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందంటూ ఆర్థిక శాఖ అప్పట్లో స్పష్టతనిచ్చింది. తాజాగా ఇ-పాస్‌బుక్‌ చూద్దామంటే అసలే అందుబాటులో లేకుండా పోయిందని నెటిజన్లు వాపోతున్నారు. అటు ఉమాంగ్‌ యాప్‌లోనూ (UMANG App) అదే పరిస్థితి ఎదురవుతోంది. టెక్నికల్‌ మెయింటెనెన్స్‌ కారణంగా అసౌకర్యం ఏర్పడుతున్నట్లు చూపిస్తోందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పది రోజులకు పైగా ఇదే పరిస్థితి నెలకొందని, ఇంకెన్ని రోజలు వేచి చూడాలని సామజిక మాధ్యమాల వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు