EPFO: పీఎఫ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌.. ఈ-నామినేష‌న్ చివరి తేదీ పొడిగింపు

ఈ నామినేషన్ చేసే ఈపీఎఫ్ఓ చందాదారుల‌కు గుడ్ న్యూస్‌.

Updated : 30 Dec 2021 14:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈపీఎఫ్‌వో చందాదారుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ-నామినేషన్‌ దాఖలు చేసే గడువును ఈపీఎఫ్‌వో పొడిగించింది. డిసెంబ‌రు 31 త‌ర్వాత కూడా ఈ-నామినేష‌న్ దాఖలు చేసే అవకాశం కల్పించింది. చందాదారుల సంబంధిత ఈపీఎఫ్ ఖాతాకు నామినీ వివ‌రాల‌ను జ‌త చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ, ఈపీఎఫ్ఓ పోర్ట‌ల్ సర్వర్ డౌన్ అవ్వ‌డం స‌మ‌స్య‌గా మారింది. ఈ నేప‌థ్యంలో ప‌లువురు వినియోగ‌దారులు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిసెంబర్‌ 31 తర్వాత కూడా నామినీ వివరాలను అప్‌డేట్‌ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు ఈపీఎఫ్‌వో ఒక ట్వీట్ చేసింది.

పీఎఫ్ నామినేష‌న్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసే విధానం..

1. ముందుగా epfindia.gov.in లో లాగిన్ అవ్వండి.

2. స‌ర్వీసెస్ సెక్ష‌న్‌కి వెళ్లి ఫ‌ర్ ఎంప్లాయీస్‌ (For Employees) బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

3. ఆపై మెంబ‌ర్ యూఏఎన్ లేదా ఆన్‌లైన్ స‌ర్వీసెస్‌ (ఓసీఎస్‌/ఓటీసీపీ) బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

4. మీ యూఏఎన్‌, పాస్‌వ‌ర్డ్‌తో లాగిన్ చేయండి.

5. మేనేజ్‌ బ‌ట‌న్ కింద ఈ-నామినేష‌న్‌ (E-Nomination) సెలెక్ట్ చేయండి.

6. మీ ఫ్యామిలీ డిక్ల‌రేష‌న్ అప్‌డేట్ కోసం Yesపై క్లిక్ చేయండి.

7. యాడ్ ఫ్యామిలీ డీటెయిల్స్‌ బ‌ట‌న్‌పై క్లిక్ చేసి వివ‌రాలు ఇవ్వండి.

8. పీఎఫ్ మొత్తంలో ఎవ‌రెవ‌రికి ఎంతెంత మొత్తం ఇవ్వాలో తెలియ‌జేసేందుకు. .నామినేష‌న్ డీటెయిల్స్‌పై క్లిక్ చేయండి.

9. డిక్ల‌రేష‌న్ ఇచ్చిన త‌ర్వాత‌ సేవ్ ఈపీఎఫ్ నామినేష‌న్ పై క్లిక్ చేయండి.

10. ఓటీపీ కోసం E-Sign బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి.

11. ఆధార్ కార్డ్‌తో లింక్ చేసిన మీ మొబైల్ నంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది.

12. ఓటీపీని ఎంట‌ర్ చేస్తే ఈపీఎఫ్‌లో మీ -నామినేష‌న్ న‌మోదు ప్ర‌క్రియ విజ‌య‌వంతం అవుతుంది.

ఈపీఎఫ్‌వో స‌భ్యులు త‌మ కుటుంబాల‌కు సామాజిక భ‌ద్ర‌త అందించ‌డానికి ఈ రోజే -నామినేష‌న్‌ను దాఖ‌లు చేయండి. నామినేష‌న్ డిజిట‌ల్‌గా దాఖ‌లు చేయ‌డానికి పైనున్న ద‌శ‌ల‌ను అనుస‌రించండి. స‌భ్యులు ఒక‌టి కంటే ఎక్కువ సార్లు పీఎఫ్ నామినీని జోడించొచ్చు. ఈపీఎఫ్ నామినేష‌న్ ఆన్‌లైన్‌లో దాఖ‌లు చేసిన త‌ర్వాత దీనికి సంబంధించిన ప‌త్రాల‌ను నేరుగా ఇవ్వ‌వ‌ల‌సిన అవ‌స‌రం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని