EPFO: ఈపీఎఫ్‌ వడ్డీ రేటు 8.15శాతం..

EPF Interest Rate: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ డిపాజిట్లపై 8.15శాతం వడ్డీఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈపీఎఫ్‌ఓ వర్గాలు వెల్లడించాయి.

Updated : 28 Mar 2023 13:12 IST

దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్‌ EPF) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు (Interest Rate)ను నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి ఈపీఎఫ్‌ఓ ప్రతిపాదనలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (8.10శాతం)తో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. (EPFO fixes interest rate)

మంగళవారం జరిగిన ఈపీఎఫ్‌ఓ (EPFO) సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ) సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ ఈపీఎఫ్‌ వడ్డీ రేటును 8.15శాతం ఇవ్వాలని నిర్ణయించారు.  సీబీటీ (CBT) నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్‌ఓ అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్ని ఈపీఎఫ్‌ఓ (EPFO) 5 కోట్ల చందాదారుల ఖాతాల్లో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

2020-21 ఆర్థిక సంవత్సరంలో పీఎఫ్‌ (PF)పై వడ్డీ రేటు 8.5 శాతంగా ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించిన వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించారు. గత నాలుగు దశాబ్దాల్లో పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం.

గత పదేళ్లలో ఈపీఎఫ్‌ (EPF) వడ్డీ రేట్లు ఇలా ఉన్నాయి..

2011-12 : 8.25 శాతం 
2012-13 : 8.5 శాతం
2013-14 : 8.75 శాతం
2014-15 : 8.75 శాతం
2015-16 : 8.8 శాతం
2016-17 : 8.65 శాతం
2017-18 : 8.55 శాతం
2018-19 : 8.65 శాతం
2019-20 : 8.5 శాతం
2020-21 : 8.5 శాతం
2021-22 : 8.1 శాతం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని