EPFO: ఈపీఎఫ్‌ బోర్డు కీలక సమావేశం.. వడ్డీరేట్లపై నిర్ణయం తీసుకుంటారా?

EPFO Interest rate: ఈపీఎఫ్ చందాదారుల నగదు నిల్వలపై ఇచ్చే వడ్డీపై మంగళవారం నిర్ణయం తీసుకోనున్నారు. అధిక పింఛనుపై కూడా ఇదే భేటీలో చర్చించనున్నారు.

Published : 27 Mar 2023 19:24 IST

దిల్లీ: ఉద్యోగ భవిష్యత్‌ నిధి సంస్థ (EPFO) అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీల (CBT) సమావేశం సోమవారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2022-23) సంబంధించి ఈపీఎఫ్‌ చందాదారుల డిపాజిట్లపై చెల్లించాల్సిన వడ్డీ రేటు గురించి చర్చించనున్నారు. ఈ నిర్ణయంపై 5 కోట్ల మంది చందాదారులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ఏడాదికి సంబంధించి వడ్డీ రేటులో పాటు అధిక పింఛను అంశాలు కూడా సమావేశంలో చర్చించనున్నారు. 

2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతంగా పీఎఫ్‌పై వడ్డీ రేటు ఉండేది. కానీ ఎన్నడూ లేని విధంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ రేటును 8.1 శాతంగా నిర్ణయించింది. గత నాలుగు దశాబ్దాల నుంచి పీఎఫ్‌పై ఇదే తక్కువ వడ్డీ రేటు కావటం గమనార్హం. ఈసారి వడ్డీరేట్లు పెంచుతారా? మరింత తగ్గిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. వడ్డీ రేట్లపై నిర్ణయం తీసుకున్నాక సమ్మతి కోసం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతుంది. ఆర్థికశాఖ ఆమోదం అనంతరం వడ్డీ మొత్తాలు పీఎఫ్‌ చందాదారుల ఖాతాల్లో జమ అవుతాయి.

గత పదేళ్లలో వడ్డీ రేట్లు ఇలా..
2011-12  8.25 శాతం 
2012-13  8.5 శాతం
2013-14  8.75 శాతం
2014-15  8.75 శాతం
2015-16  8.8 శాతం
2016-17  8.65 శాతం
2017-18  8.55 శాతం
2018-19  8.65  శాతం
2019-20  8.5 శాతం
2020-21    8.5 శాతం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని