56.79 లక్షల కొవిడ్‌ క్లెయిమ్‌ల పరిష్కారం

ఈపీఎఫ్‌వో 56.79లక్షల  కొవిడ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇవన్నీ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ క్లెయిములే. ఇప్పటి వరకు వీటికి సంబంధించి డిసెంబర్‌ 31 నాటికి రూ.14,310...

Published : 17 Jan 2021 15:27 IST

ఇంట్నర్నెట్‌డెస్క్‌: ఈపీఎఫ్‌వో 56.79లక్షల  కొవిడ్‌ క్లెయిమ్‌లను పరిష్కరించింది. ఇవన్నీ నాన్‌ రిఫండబుల్‌ అడ్వాన్స్‌ క్లెయిములే. ఇప్పటి వరకు వీటికి సంబంధించి డిసెంబర్‌ 31 నాటికి రూ.14,310 కోట్లను విడుదల చేసింది. వ్యవస్థీకృత రంగంలోని ఉద్యోగులు ఏస్థాయిలో కొవిడ్‌ దెబ్బకు ఇబ్బంది పడ్డారో ఈ క్లెయిమ్‌లే వెల్లడిస్తున్నాయి. మార్చిలో లాక్‌డౌన్‌ విధించిన సమయంలో ఉద్యోగులు ఈపీఎఫ్‌వో నుంచి నిధులను డ్రా చేసుకోవడానికి అనుమతించింది. ఇది ఆ ఉద్యోగి మూడునెలల బేసిక్‌, డీఏను మించకుండా ఉండాలి. లాక్‌డౌన్‌ సమయంలో ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఈ వెసులుబాటును కల్పించింది. 

ఈపీఎఫ్‌వో సంస్థ ఏడాది మొత్తం మీద  197.91లక్షల క్లెయిములను సెటిల్‌ చేసింది.  వీటిల్లో ఫైనల్‌ సెటిల్మెంట్‌, మరణాలు, బీమా, అడ్వాన్స్‌ క్లెయిములు ఉన్నాయి. ఈపీఎఫ్‌వో ఇందుకోసం రూ.73,288 కోట్లను చెల్లించింది. మొత్తం క్లెయిముల్లో కొవిడ్‌వి ఐదోవంతు ఉండటం పరిస్థితిని తెలియజేస్తోంది. కొవిడ్‌ కారణంగా వ్యవస్థీకృత రంగంలో పలువురు ఉద్యోగాలు పోవడం, జీతాలు తగ్గించడం, వలస వెళ్లడం వంటి కారణాలతో ఉపాధి కోల్పోయారు. దీంతో క్లెయిముల సంఖ్య భారీగా పెరిగింది. ఇక ప్రైవేటు ఈపీఎఫ్‌వో సంస్థలు కూడా 4.19లక్షల కొవిడ్‌ సెటిల్మెంట్లు చేశాయి. ఇందుకోసం రూ.3,983 కోట్లను చెల్లించాయి. 

ఇవీ చదవండి

భూలోక కుబేరుడు.. కారు రిపేరుకు డబ్బులు లేవట!

మాకు దక్కిన అరుదైన గౌరవం: సుచిత్ర ఎల్ల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు