EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. పదే పదే క్లెయింల తిరస్కరణలకు చెక్!
పీఎఫ్ క్లెయింలను వివిధ కారణాలతో పలుమార్లు తిరస్కరిస్తున్నారని, అలాగే నిర్ణేత సమయంలో క్లెయింలను పరిష్కరించడం లేదని పీఎఫ్ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఈపీఎఫ్ (EPF) ఖాతాదారులకు శుభవార్త. సభ్యులకు మెరుగైన సేవలు అందించే దిశగా ఈపీఎఫ్ఓ (EPFO) చర్యలు తీసుకుంటోంది. పీఎఫ్ క్లెయింలను తర్వగా పరిష్కరించడం కోసం ప్రాసెసింగ్‌లో జాప్యాన్ని తగ్గించాలని, ఒకే క్లెయింను పదేపదే తిరస్కరించకుండా చూసుకోవాలని తమ ఫీల్డ్ కార్యాలయాలను కోరింది. ఈపీఎఫ్ఓ ఫీల్డ్ ఆఫీసులకు ఇటీవల విడుదల చేసిన లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
పీఎఫ్ క్లెయింలను వివిధ కారణాలతో పలుమార్లు తిరస్కరిస్తున్నారని, అలాగే నిర్ణేత సమయంలో క్లెయింలను పరిష్కరించడంలేదని పీఎఫ్ ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో క్లెయింలు పదేపదే తిరస్కరణకు గురికాకుండా కఠినమైన మార్గదర్శకాలను నిర్దేశించింది.
ఈ నియమాల ప్రకారం ప్రతి క్లెయింనూ మొదటిసారే క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ క్లెయిం సరిగ్గా లేకపోతే తిరస్కరించవచ్చు. అయితే తిరస్కరణకు గల అన్ని కారణాలను ఒకేసారి ఈపీఎఫ్ సభ్యుడికి తెలియజేయాలి.
ప్రాంతీయ లేదా అదనపు పీఎఫ్ కమిషనర్ వారి అధికారిక పరిధిలోని పీఎఫ్ క్లెయింల తిరస్కరణ బాధ్యత వహిస్తారు. ప్రతినెలా తిరస్కరణకు గురైన క్లెయింలలో 50 లేదా 1%, ఏది ఎక్కువగా ఉంటే.. అన్ని క్లెయింలను విశ్లేషించి సంబంధిత డేటాను సమీక్ష కోసం జోనల్ కార్యాలయానికి సమర్పించాలి.
గతేడాదిలో ఈపీఎఫ్ఓ దాదాపు 4 కోట్ల క్లెయింలను క్లియర్ చేసింది. ఈపీఎఫ్ సభ్యులు వివిధ కారణాల (ఇల్లు నిర్మాణం, వివాహం, ఉద్యోగం కోల్పోవడం)తో పీఎఫ్ మొత్తాన్ని పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ విత్‌డ్రా చేసుకునే వీలుంది. విత్‌డ్రా కోసం ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సాంకేతికంగా పీఎఫ్ క్లెయింలను 20 రోజుల్లోపు పరిష్కరించవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు, కేవైసీ, ఇతర వివరాలు సరిగ్గా లేకపోవడంతో పీఎఫ్ క్లెయింలు తరచూ తిరస్కరణకు గురవుతుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది. -
టర్మ్ బీమా ప్రీమియంలు ఎంతెంత?
చిన్న వయసులోనే జీవిత బీమా తీసుకుంటే ప్రీమియం తక్కువగా ఉంటుంది. వివిధ బీమా సంస్థలు వసూలు చేసే ప్రీమియంలు ఎంతెంతున్నాయో ఇక్కడ చూడండి. -
రెగ్యులర్ Vs డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్.. ఏది బెటర్?
Mutual Funds: మ్యూచువల్ ఫండ్లలో మదుపర్లకు రెండు రకాల పథకాలు అందుబాటులో ఉంటాయి. వాటిలో ఏది ఎంచుకోవాలో చాలా మందికి అవగాహన ఉండదు. -
వివిధ లార్జ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి
3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ పథకాలు ఇక్కడ ఉన్నాయి. -
స్థిరాస్తుల్లో మదుపు చేద్దామా
పెట్టుబడులు పెట్టేందుకు అనేక మార్గాలు అందుబాటులో ఉన్నాయి. షేర్లు, బాండ్లు, ఫిక్స్డ్ డిపాజిట్లలాంటి పెట్టుబడి పథకాలు, బంగారం, స్థిరాస్తుల వరకూ ఎన్నో విస్తృత శ్రేణి ఎంపికలు ఉన్నాయి. -
ఓటీపీ ఆ అంకెలు జాగ్రత్త
ఒక్క క్లిక్‌తో కావాల్సినవన్నీ కొనేస్తున్నాం. బ్యాంకింగ్ లావాదేవీలన్నీ చేసేస్తున్నాం. వీటన్నింటికీ ఆరంకెల ఓటీపీ (వన్ టైమ్ పాస్వర్డ్) చాలు.. ఇంత సౌలభ్యంతోపాటు, కొన్ని ప్రమాదాలూ పొంచి ఉన్నాయి -
పన్ను ప్రణాళికకు తరుణమిదే..
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో.. ఆదాయపు పన్ను మినహాయింపుల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పాత పన్నువిధానంలోనే ముందుకెళ్లాలని ఆలోచిస్తున్న వారు -
రెస్టరంట్లో డబ్బు ఆదా చేయడానికి చిట్కాలు
ఎప్పుడైనా కుటుంబంతో కలిసి రెస్టరంట్‌కు వెళ్లాలనుకునేవారు బిల్లుపై తగ్గింపు పొందాలనుకుంటారు. అలాంటి వారికోసమే కొన్ని చిట్కాలు. -
ఆన్లైన్ vs ఆఫ్‌లైన్ బీమా.. ఏది మెరుగైనది?
ప్రస్తుతం అన్ని రకాల బీమా పాలసీలు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో లభిస్తున్నాయి. ఇవి వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తాయి? ఎలా మెరుగైనవి అనేది ఇక్కడ తెలుసుకోండి. -
ఎన్పీఎస్ లాగిన్, క్రెడిట్ కార్డ్ రూల్స్.. ఏప్రిల్ 1 నుంచి రాబోతున్న మార్పులివీ..
Changes from april 1st: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక పరమైన మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అవేంటో చూసేయండి..
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం