EPFO: వచ్చే నెలలో సీబీటీ కీలక భేటీ.. ఈపీఎఫ్ వడ్డీ రేటుపై నిర్ణయం
దిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)కు చెందిన అత్యున్నత నిర్ణయాక మండలి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ (CBT) సమావేశం వచ్చే (మార్చి) నెలలో జరగనుంది. ఈ భేటీలో 2021-22 ఆర్థిక సంవత్సరానికి గానూ పీఎఫ్ మొత్తాలపై చెల్లించాల్సిన వడ్డీ రేటుపై నిర్ణయం తీసుకోనున్నారు. అస్సాం రాజధాని గువాహటిలో ఈ సమావేశం జరగనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు.
2020-21 ఆర్థికసంవత్సరంలో వడ్డీ రేటను 8.5 శాతంగా నిర్ణయించారు. ఈ ఏడాదీ అంతే మొత్తం నిర్ణయించే అవకాశం ఉందా? అని మంత్రిని ప్రశ్నించగా.. ఆదాయ అంచనాలపై ఆధారపడి నిర్ణయం ఉంటుందని బదులిచ్చారు. సాధారణంగా వడ్డీ రేటుపై సీబీటీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుంది. ఆ మేరకు వడ్డీని జమ చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేస్తుంది. 202-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ మొత్తాలు ఇప్పటికే చందాదారుల ఖాతాల్లో జమ అయ్యాయి.
ఏ ఏడాది వడ్డీ రేటు ఎంత..?
- 2012-13- 8.5 శాతం
- 2013-14- 8.75 శాతం
- 2014-15- 8.75 శాతం
- 2015-16- 8.8 శాతం
- 2016-17- 8.65 శాతం
- 2017-18- 8.55 శాతం
- 2018-19- 8.65 శాతం
- 2019-20- 8.5 శాతం
- 2020-21- 8.5 శాతం
2011-12లో కనిష్ఠంగా 8.25 శాతం వడ్డీ ఇవ్వగా.. 2015-16లో అత్యధికంగా 8.8 శాతం వడ్డీ ఇచ్చారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
Politics News
Eknaht Shindhe: శిందే కేబినెట్లో ఫడణవీస్‌కే కీలక శాఖలు
-
Sports News
Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
-
Crime News
Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
-
World News
UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్