ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల గురించి 7 విష‌యాలు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే అన్నిర‌కాల ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు​​​​​...

Updated : 01 Jan 2021 20:28 IST

స్టాక్‌ల‌లో పెట్టుబ‌డులు పెట్టేవాటిని ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ అంటారు. ఇప్పుడు ఎక్కువగా ఈ పెట్టుబ‌డుల‌కే ఆస‌క్తి చూపుతున్నారు. త‌క్కువ రాబ‌డినిచ్చే ఎన్ఎస్‌సీ, పీపీఎఫ్‌, ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే మంచి రాబ‌డి పొంద‌డంతో పాటు ప‌న్ను మిన‌హాయింపులు కూడా ఉన్నాయి. ప‌న్ను ఆదా చేసుకునేందుకు ప్ర‌త్యేక‌మైన‌వి కొన్ని ఫండ్లు ఉన్నాయి. ఈ ర‌క‌మైన ఫండ్లు ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదిగ‌మించి మంచి రాబ‌డిని ఇస్తాయ‌ని చెప్తున్నారు నిపుణులు.

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే…

  1. ఆర్థిక ల‌క్ష్యాన్ని చేరుకోవ‌చ్చు

మ్యూచువ‌ల్ పండ్ల‌లోని ఓపెన్-ఎండెడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే మీ అవ‌స‌రానికి త‌గిన‌ట్లుగా డ‌బ్బును తీసుకోవ‌చ్చు. పిల్ల‌ల చ‌దువులు, పెళ్లి, ప‌ర్య‌ట‌న‌, ప‌ద‌వీ విర‌మ‌ణ వంటి వాటిని సంప‌ద సృష్టించుకోవ‌చ్చు. వారి ల‌క్ష్యానికి త‌గిన‌ట్లుగా ప్ర‌ణాళిక చేసుకొని స‌రిపోయే ఫండ్‌లో పెట్టుబ‌డులు పెడితే అనుకున్న ల‌క్ష్యాన్ని చేరుకోవ‌చ్చు. అయితే ఈక్విటీ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేటెప్పుడు క‌నీసం 5 సంవ‌త్స‌రాలు అయినా కొన‌సాగిస్తే ఆశించిన లాభాల‌ను పొంద‌వ‌చ్చు.

  1. పెట్టుబ‌డుల విభ‌జ‌న‌

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు మొత్తం అంతా ఒకేదానిలో కాకుండా వివిధ రంగాల‌కు సంబంధించిన షేర్ల‌లో పెట్టుబ‌డులు పెట్టాలి. అప్పుడు రిస్క్ త‌గ్గి, రాబ‌డి పెరుగుతోంది. మార్కెట్ ఒడుదొడుకుల‌కు లోనైన‌ప్ప‌టికీ న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. సొంతంగా పెట్టుబ‌డులు పెట్ట‌డం కంటే ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

  1. ప‌న్ను ఆదా చేసే ఫండ్లు

పెట్టుబ‌డుదారులు ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్ స్కీమ్‌ల‌లో (ఈఎల్ఎస్ఎస్) పెట్టుబ‌డులు పెడితే ప‌న్ను ఆదా చేసుకోవ‌చ్చు. ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961 ప్ర‌కారం, సెక్ష‌న్ 80 సీ కింద‌ రూ.1.5 ల‌క్షల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది.

  1. ప‌న్ను ర‌హిత ఫండ్లు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్లలో ఏడాది కంటే ఎక్కువ కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే ప‌న్ను ఉండ‌దు. త‌ర్వాత‌ మ్యూచువ‌ల్ ఫండ్ల నుంచి రూ.10 ల‌క్ష‌ల డివిడెండ్‌కు కూడా ప‌న్ను వ‌ర్తించ‌దు.

  1. ఎక్క‌వ రాబ‌డి పొందే అవ‌కాశం

మ్యూచ‌వ‌ల్ ఫండ్ల‌లో రీ-ఇన్వెస్ట్‌మెంట్ ఆప్ష‌న్‌లో మీ పెట్టుబ‌డులు తిరిగి రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తారు. ప్ర‌తి ఏడాది వ‌చ్చే రాబ‌డి కూడా దానిలో జ‌మ‌వుతుంది. ఎంత ఎక్కువ‌గా పెట్టుబ‌డులు పెడితే అంత ఎక్కువ‌గా లాభం పొందే అవ‌కాశం ఉంటుంది.

  1. విత్‌డ్రా చేసుకోవ‌డం సుల‌భం

ఓపెన్-ఎండెడ్ ఈక్విటీ ఫండ్ల‌లో డ‌బ్బును విత్‌డ్రా చేసుకోవ‌డం చాలా సుల‌భం. ఎల‌క్ర్టానిక్ క్లియ‌రింగ్ సిస్ట‌మ్ ద్వారా (ఈసీఎస్‌) డైరెక్ట్ ఫ్లాన్‌లో పెట్టుబ‌డులు ప్రారంభించ‌వ‌చ్చు. ఎప్పుడు అవ‌స‌ర‌ముంటే అప్పుడు సుల‌భంగా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. మూడు రోజుల్లో డ‌బ్బు మీ చేతికందుతుంది.

  1. సిప్ ద్వారా కూడా పెట్టుబ‌డులు

ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా లేదా ఏక‌మొత్తంలో ఒకేసారి పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు. సిప్‌ను మ‌ధ్య‌లో కూడా ఆపివేసే అవ‌కాశ‌ముంటుంది. క్రమానుగ‌త ఉప‌సంహ‌ర‌ణ‌ల (ఎస్‌డ‌బ్ల్యూపీ) ద్వారా కూడా న‌గ‌దును విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని