EV Bikes: ‘షెమా’ నుంచి కొత్తగా రెండు దేశీ ఈవీ బైకులు!

దేశంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ) జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ కంపెనీల నుంచి ఈవీ బైకులను మార్కెట్లోకి విడుదల కాగా.. తాజాగా ఒడిశాకు చెందిన వాహన తయారీ సంస్థ షెమా ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ అండ్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(సెస్‌) రెండు రకాల కొత్త విద్యుత్‌ వాహనాలను ఈవీ ఇండియా

Published : 27 Dec 2021 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో విద్యుత్‌ వాహనాల(ఈవీ) జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ కంపెనీల నుంచి ఈవీ బైకులు మార్కెట్లోకి విడుదల కాగా.. తాజాగా ఒడిశాకు చెందిన వాహన తయారీ సంస్థ షెమా ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ అండ్‌ సోలార్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌(సెస్‌) కొత్తగా రెండు రకాల విద్యుత్‌ వాహనాలను ఈవీ ఇండియా ఎక్స్‌పో వేదికగా మార్కెట్లోకి విడుదల చేసింది. 

హై స్పీడ్‌ కేటగిరిలో ‘సెస్‌ టఫ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈవీ బైక్‌.. టాప్‌ స్పీడ్‌ గంటకు 60కిలోమీటర్లుగా ఉంది. వ్యాపారులకు అనుగుణంగా తీర్చిదిద్దిన ఈ బైక్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 150 కి.మీ వరకు వెళ్తుంది. 60వీ, 30ఏహెచ్‌ లిథియమ్‌ డిటాచబుల్‌ బ్యాటరీతో నడిచే ఈ బైక్‌.. 150 కిలోల బరువును మోయగలదు. దీని ప్రారంభ ధర రూ. 67వేలుగా ఉంది. ఇక లో స్పీడ్‌ కేటగిరిలో ‘సెస్‌ హాబీ’ బైకును పరిచయం చేశారు. దీని టాప్‌ స్పీడ్‌ గంటకు 25కి.మీ మాత్రమే. సెస్‌ టఫ్‌లో ఉపయోగించిన బ్యాటరీనే దీనికీ వాడారు. బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవడానికి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 100 కి.మీల వరకు నడపొచ్చు. అయితే, దీని ధరను మాత్రం సంస్థ వెల్లడించలేదు. ఈ రెండు మోడళ్లు దేశీయంగా తయారు చేసినవే. ‘‘దేశంలో ఈవీ బైకుల విక్రయాలు ఊపందుకున్నాయి. వినియోగదారుల అంచనాలను అందుకునేలా మా సంస్థ నుంచి ఈవీ బైకులను తీసుకొస్తున్నాం. ఏప్రిల్‌లోగా మరో రెండు లేదా మూడు రకాల హై స్పీడ్‌ ఈవీ బైకులను విపణిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం’’అని షెమా సంస్థ ఫౌండర్‌, సీఓఓ యోగేశ్‌ కుమార్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని