Electric motorcycle: గేర్లతో విద్యుత్‌ బైక్‌.. ఆవిష్కరించిన మ్యాటర్‌

విద్యుత్‌ వాహన, ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీ అంకురం మ్యాటర్‌ సోమవారం గేర్‌లతో నడిచే విద్యుత్‌ బైక్‌ను ఆవిష్కరించింది.

Updated : 22 Nov 2022 12:50 IST

దిల్లీ: విద్యుత్‌ వాహన, ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీ అంకురం మ్యాటర్‌ సోమవారం గేర్‌లతో నడిచే విద్యుత్‌ బైక్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ గేర్‌ విద్యుత్‌ మోడల్‌ బైక్‌లకు త్వరలోనే బుకింగ్‌లు ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని వెల్లడించింది.

వచ్చే 12 నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 200 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా వంటి మార్కెట్లకు వచ్చే రెండేళ్లలో ఎగుమతులు కూడా చేయాలనుకుంటున్నట్లు మ్యాటర్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ మోహల్‌ లాల్‌భాయ్‌ వెల్లడించారు. ఈ గేర్‌ విద్యుత్‌ బైక్‌ను ఒకసారి ఛార్జ్‌ చేస్తే 125-150 కి.మీ. ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది. సాధారణ 5 యాంప్‌ ప్లగ్‌తోనూ ఛార్జింగ్‌ చేసేందుకు వీలుందని పేర్కొంది. ఏడాదికి 60,000 బైక్‌ల ఉత్పత్తితో ప్రారంభించి తర్వాత 1.5-1.7 లక్షలకు పెంచుతామని వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని