Evergrande: చైనాలో ఆగని గృహ సంక్షోభ ప్రకంపనలు..!

చైనాలోని దిగ్గజ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎవర్‌గ్రాండ్‌ మార్కెట్‌ విలువ మరోసారి భారీగా పతనమైంది. రెండు రోజుల్లో సంస్థ షేర్లు 25శాతం విలువ కోల్పోయాయి. మరో వైపు రుణ పునర్‌ వ్యవస్థీకరణ సంక్లిష్టంగా మారిందని సంస్థ పేర్కొంది.  

Updated : 26 Sep 2023 14:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: చైనా(China)లో అతిపెద్ద రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఎవర్‌గ్రాండ్‌ (Evergrande) సమస్యల నుంచి బయటపడే అవకాశం కనుచూపు మేరలో లేదు. ఆ కంపెనీకి చెందిన హెంగ్డా రియల్‌ ఎస్టేట్‌ సంస్థ దాదాపు 547 మిలియన్‌ డాలర్ల రుణాలు చెల్లించలేక చేతులెత్తేసింది. దీంతో గత రెండు రోజుల్లో ఎవర్‌గ్రాండ్‌ షేర్లు నాలుగోవంతు విలువ కోల్పోయాయి. అంతేకాదు.. ఇటీవల చైనా అధికారులు ఎవర్‌గ్రాండ్‌ ప్రస్తుత, మాజీ అధికారులను అదుపులోకి తీసుకొన్నట్లు స్థానిక వార్తా సంస్థ ఒకటి కథనం వెలువరించింది. వీరిలో కంపెనీ మాజీ సీఈవో షియా హజున్‌, ఫైనాన్స్‌ విభాగం మాజీ అధిపతి పెన్‌ డారోంగ్‌ ఉన్నట్లు వెల్లడించింది. 

ఆదివారం ఎవర్‌ గ్రాండే సంస్థ హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజికి కీలక సమాచారాన్ని అందించింది. తమ అనుబంధ సంస్థ అయిన హెంగ్డా రియల్‌ ఎస్టేట్‌పై అధికారులు దర్యాప్తు చేపట్టారని పేర్కొంది. దీంతో తమ రుణ పునర్ వ్యవస్థీకరణ ప్లాన్‌ అనుకున్నట్లు సాగే పరిస్థితి లేదని వెల్లడించింది. 

మస్క్‌ పేరు మార్చుకుంటున్నారా..?చర్చకు దారితీసిన తాజా పోస్టు

ఈ నెల మొదట్లో ఎవర్‌గ్రాండ్‌కు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ఉద్యోగులను షెంజన్‌ నగరంలో చైనా అధికారులు అరెస్టు చేశారు. ఈ సంస్థలో వీరు మోసాలకు పాల్పడటంతోనే అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మరోవైపు ఎవర్‌గ్రాండ్‌ చెందిన బీమా విభాగాన్ని ప్రభుత్వ రంగ సంస్థ ఆధీనంలోకి తీసుకొంటున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో కంపెనీ రుణ పునర్‌వ్యవస్థీకరణ క్లిష్టంగా మారింది. ఇప్పటికే ఈ కంపెనీపై దాదాపు 300 బిలియన్ డాలర్ల రుణం ఉంది. దీనిలో చాలా వరకు చైనాలో సాధారణ ప్రజల నుంచి సేకరించిన మొత్తమే. చైనా బయట నుంచి సేకరించిన రుణాల మొత్తం కేవలం 31 బిలియన్‌ డాలర్లు మాత్రమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని