Womens Day: ఈ పథకాలు మహిళల కోసమే.. వీటి గురించి తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: డబ్బుకు సంబంధించిన వ్యవహారం అంతా పురుషులే చూసుకోవాలనే ఆలోచనలకు కాలం చెల్లింది. కార్పొరేట్ ప్రపంచాన్ని ఏలుతున్న మహిళలు.. ఆర్థికంగా ఇంటిని సరిదిద్దడంలో ఎప్పుడూ కీలకమే. ఇంతటి ముఖ్యమైన పాత్ర పోషించే మహిళల సాధికారత (Women Empowerment) కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా వారి ఆర్థిక స్వాతంత్ర్యం కోసం అనేక పథకాలను తీసుకొచ్చింది. కానీ, చాలా మందికి అవేంటో తెలియదు. వీటిపై అవగాహన పెంచడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టినప్పటికీ.. ఇంకా ఎంతో పురోగతి సాధించాల్సి ఉంది.
పొదుపు ఖాతాల్లో మహిళలకు ప్రత్యేక ప్రయోజనాలు..
సాధారణ సేవింగ్స్ బ్యాంక్ ఖాతా ఫీచర్లతో పాటు మహిళల కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ప్రత్యేక ప్రయోజనాలను అందజేస్తాయి. మహిళల ఆర్థిక సాధికారితకు అనుగుణంగా ఆయా ప్రయోజనాలను ఎప్పటికప్పుడు సవరిస్తుంటాయి. అలాగే ప్రత్యేక సందర్భాల్లో రాయితీలు, రివార్డులు కూడా అందజేస్తాయి. షాపింగ్, ఫుడ్, వెల్‌నెస్, ఎంటర్‌టైన్‌మెంట్‌లోనూ ప్రత్యేక ఆఫర్లు ఉంటాయి. రుణరేట్లలోనూ కొంత రాయితీనిస్తాయి. మరోవైపు పిల్లల కోసం మహిళలు ప్రత్యేకంగా జూనియర్ అకౌంట్ తెరిచే అవకాశం కూడా ఉంటుంది. పైగా సేవింగ్స్ ఖాతాకు అనుసంధానంగా రికరింగ్ డిపాజిట్, సిప్ చేసినవారికి కొన్ని బ్యాంకులు ‘మంత్లీ మినిమం బ్యాలెన్స్’ నిబంధనలను వర్తింపజేయడం లేదు.
తక్కువ బీమా ప్రీమియం..
కుటుంబం కోసం నిరంతరం శ్రమించే మహిళల భద్రత కోసం బీమా తప్పనిసరి. వారు కచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేలా ప్రోత్సహించడం కోసం బీమా కంపెనీలు ప్రీమియంలో తగ్గింపునిస్తున్నాయి. పురుషులతో పోలిస్తే ఆరోగ్య, జీవిత బీమా పాలసీ ప్రీమియంలు మహిళలకు తక్కువగా ఉంటాయి.
తక్కువ వడ్డీరేటుతో రుణాలు..
చాలా వరకు బ్యాంకులు మహిళలకు ఇచ్చే లోన్లపై వడ్డీరేటులో రాయితీనిస్తాయి. సందర్భాన్ని బట్టి 0.05% నుంచి 0.5% వరకు డిస్కౌంట్ ఉండొచ్చు. ముఖ్యంగా గృహరుణాల్లో ఈ ప్రయోజనం ఉంటుంది. ఉమ్మడిగా తీసుకునే రుణాల్లో ప్రధాన దరఖాస్తుదారుగా మహిళ ఉన్నా కూడా వడ్డీరేటు తగ్గుతుంది. కొన్ని బ్యాంకులు కారు లోన్లపై కూడా మహిళలకు వడ్డీరేటును తగ్గిస్తున్నాయి. కేవలం వడ్డీరేటులో రాయితీ మాత్రమే కాదు.. ప్రాసెసింగ్ ఫీజులోనూ ఒక్కోసారి మినహాయింపు ఉంటుంది.
మహిళా వ్యాపారవేత్తల కోసం ప్రత్యేక పథకాలు..
మహిళా ఔత్సాహిక వ్యాపారవేత్తల కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలను తీసుకొచ్చింది. సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి భారతీయ మహిళా బ్యాంకు వ్యాపార రుణాలను అందిస్తోంది. మహిళల నేతృత్వంలో నడిచే తయారీ కంపెనీలకు ఈ స్కీం కింద రూ.20 కోట్ల వరకు రుణాన్నిస్తారు. వడ్డీరేటు 10.15 శాతం.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకైతే రూ.1 కోటి వరకు ఎలాంటి తనఖా లేకుండానే లోన్ అందజేస్తారు.
అన్నపూర్ణ స్కీమ్..
ఫుడ్ కేటరింగ్ బిజినెస్ స్థాపించే మహిళల కోసం ప్రభుత్వం అన్నపూర్ణ స్కీం పేరిట రూ.50 వేల వరకు రుణాలందిస్తోంది. వీటితో కావాల్సిన వంటపాత్రలు సహా ఇతర సామగ్రిని కొనుగోలు చేసుకోవచ్చు. బ్యాంకు, ప్రాంతం బట్టి వడ్డీరేటు మారుతుంది. దీన్ని మూడేళ్లలో తిరిగి చెల్లించేయాలి. అలాగే TREAD (Trade-Related Entrepreneurship Assistance and Development) అనే స్కీమ్ ద్వారా మహిళలకు తయారీ, సేవలు, వ్యాపార రంగాల్లో కావాల్సిన రుణం, శిక్షణ వంటి సహకారాన్ని అందిస్తోంది. మొత్తం ప్రాజెక్టు ఖర్చులో 30 శాతం వరకు ప్రభుత్వం గ్రాంట్ కింద అందజేస్తుంది.
వర్కింగ్ విమెన్ హాస్టల్..
ఉద్యోగం చేసే మహిళల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా వర్కింగ్ విమెన్ హాస్టల్స్ స్కీమ్‌ను తీసుకొచ్చింది. వారి పిల్లల సంరక్షణకు కూడా ఈ హాస్టల్స్‌లో ఏర్పాట్లు ఉంటాయి. నెలవారీ ఆదాయం రూ.50,000 కంటే తక్కువ ఉన్నవారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది.
మహిళా శక్తి కేంద్రాలు..
మహిళల సర్వతోముఖాభివృద్ధిని కాంక్షిస్తూ.. 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కావాల్సిన నైపుణ్య శిక్షణనిచ్చి ఉపాధి, ఉద్యోగాలు కల్పించేలా ఆయా ప్రాంతాల్లో మహిళా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఎస్‌ఎస్‌వైతో బాలికల భవిష్యత్ బంగారం..
సుకన్య సమృద్ధి ఖాతా అనేది బాలికల కోసం ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ పథకంపై వడ్డీ ప్రస్తుతం 7.60% లభిస్తుంది. బాలికలకు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ ఖాతాను తెరవొచ్చు. ఒక బాలికకు ఒక ఖాతా మాత్రమే తెరవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇద్దరు బాలికల వరకు ఖాతా తెరిచే అనుమతి ఉంటుంది. ఖాతాను పోస్టాఫీసు లేదా అనుమతి ఉన్న బ్యాంకుల శాఖలలో తెరవొచ్చు. ఖాతాను తెరిచేటప్పుడు బాలిక జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఖాతాను భారతదేశం అంతటా ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. ఖాతా 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్ అవుతుంది.
మహిళా-ఈ-హాత్..
కేంద్ర శిశు, మహిళాభివృద్ధి శాఖ మహిళా-ఈ-హాత్ పథకాన్ని పర్యవేక్షిస్తోంది. దీన్ని 2016లో ప్రారంభించారు. మహిళా-ఈ-హాత్ ఒక ద్విభాషా మార్కెటింగ్ ప్లాట్‌ఫామ్. మహిళా వ్యాపారవేత్తలు, స్వయం సహాయక సంఘాలు, లాభాపేక్ష లేని సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకునేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
ఎస్‌బీఐ స్త్రీ శక్తి స్కీమ్..
వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఎస్‌బీఐ రూ.50 లక్షల వరకు వ్యక్తిగత రుణాన్ని అందజేస్తోంది. అయితే, వ్యాపారంలో మహిళలకు కనీసం 50 శాతం వాటా ఉండాలి. ఐదు లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేదు. దరఖాస్తుదారు క్రెడిట్ హిస్టరీ, బిజినెస్ అసవరాలను బట్టి వడ్డీరేటు మారుతుంటుంది. ఏడాది నుంచి ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
ఓరియెంట్ మహిళా వికాస్ యోజన స్కీం..
ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఈ స్కీమ్‌ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వ్యాపారాలను ప్రారంభించాలనుకునే మహిళల కోసం ఈ పథకం ఉపయుక్తంగా ఉంటుంది. రూ.25 లక్షల వరకు ఎలాంటి తనఖా అవసరం లేదు.
వీటితో పాటు ముద్రా లోన్, డేనా శక్తి స్కీమ్, మహిళా ఉద్యమ్ నిధి యోజన, సెంట్ కల్యాణి యోజన, ఉద్యోగిని స్కీమ్, ప్రధాన మంత్రి రోజ్‌గార్ యోజన, సింధ్ మహిళా శక్తి స్కీమ్ వంటి పథకాలు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే మహిళలకు సహకారాన్ని అందిస్తున్నాయి.
భారతీయ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆర్థిక విషయాల్లోనూ ఎంతో నేర్పుగా వ్యవహరిస్తున్నారు. ఇంటి ఆర్థిక విషయాలకే పరిమితం కాకుండా.. పొదుపు, పెట్టుబడుల్లాంటి అంశాల్లోనూ ఇప్పుడు చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఎంతో పురోగతి సాధించాల్సి ఉంటుంది. అందుకోసం ప్రభుత్వం చేపడుతున్న అనేక చర్యలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Samantha: అలాంటి పాత్రలో నటించినందుకు ఆనందంగా ఉంది: సమంత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs AUS: సూర్య కుమార్ యాదవ్‌కు రోహిత్ మద్దతు
-
India News
Karnataka: టిప్పు సుల్తాన్‌పై రగులుకొన్న రాజకీయం
-
Movies News
‘ఆడియన్స్ ఈ ప్రశ్న నన్ను అడగలేదు’.. సిద్ధార్థ్‌తో రిలేషన్‌పై విలేకరి ప్రశ్నకు అదితి రియాక్షన్
-
India News
Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Suryakumar Yadav: హ్యాట్రిక్ డక్.. తొలి బంతికే.. వరుసగా విఫలమవుతున్న సూర్యకుమార్
- Sarus crane: కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
- Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (23/03/2023)
- IND vs AUS: సిరీస్.. ఇచ్చేశారు
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష
- vizag: విశాఖలో భవనం కూలిన ఘటన.. అన్నాచెల్లెలు మృతి
- Rashmika: అప్పుడు విమర్శలు ఎదుర్కొని.. ఇప్పుడు రక్షిత్‌కి క్రెడిట్ ఇచ్చి
- NTR 30: యంగ్ టైగర్ కొత్త సినిమా షురూ.. బ్యాక్‌డ్రాప్ చెప్పేసిన కొరటాల శివ
- Samyuktha: ‘విరూపాక్ష’ టీమ్‌పై నటి సంయుక్త ఆగ్రహం
- Hormonal Contraceptive: గర్భ నిరోధానికి కొత్త సాధనం