IP ratings: ఐపీ రేటింగ్‌ అంటే ఏంటి? IP67, IP68ని ఎలా అర్థం చేసుకోవాలి?

IP ratings: మొబైల్‌ తయారీ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్‌లకు ఐపీ రేటింగ్‌లు ఇస్తుంటాయి. అసలేంటా రేటింగ్స్‌? ఎందుకు ఉపయోగపడతాయి?

Published : 26 Jun 2024 15:23 IST

IP ratings | ఇంటర్నెట్‌డెస్క్‌: మొబైల్‌ యూజర్ల అభిరుచులు, వారి అవసరాలకు తగినట్లుగా కంపెనీలు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తుంటాయి. ట్రెండ్‌ను ఫాలో అవుతూ ఫీచర్లను జోడిస్తూ కొత్త మొబైల్స్‌ను ఆవిష్కరిస్తుంటాయి. అలా వచ్చిన ఫీచర్లలో ఐపీ రేటింగ్స్‌ ఒకటి (IP ratings). తాజాగా లాంచ్‌ అయిన దాదాపు అన్ని స్మార్ట్‌ఫోన్లలోనూ ఐపీ రేటింగ్స్‌ ప్రస్తావన ఉంటోంది. ఇంతకీ అసలేంటీ ఐపీ రేటింగ్‌? దీనివల్ల ప్రయోజనం ఏంటి?

స్మార్ట్‌ఫోన్ లేదా ఏదైనా గ్యాడ్జెట్‌లోకి దుమ్మూ, నీరు చేరకుండా నిరోధించడంలో ఉండే సామర్థ్యం తెలిపేదే ఈ ఐపీ రేటింగ్‌ (IP Rating). ఒకప్పుడు ప్రీమియం ఫోన్లలో మాత్రమే వాటర్‌ రెసిస్టెంట్‌ ఫీచర్‌ అందుబాటులో ఉండేది. ఇప్పుడు రూ.20వేల బడ్జెట్‌ కలిగిన ప్రముఖ బ్రాండ్‌ ఫోన్లలోనూ ఐపీ రేటింగ్‌ ఉంటోంది. ఆయా స్మార్ట్‌ఫోన్ల ప్రకటన ఇచ్చేటప్పుడు ఈ రేటింగ్స్‌ను ప్రముఖంగా ప్రస్తావించడం మీరు గమనించొచ్చు. ఇవి IP67, IP68.. ఇలా ఉంటాయి.

రోడ్లు సరిగా లేకపోతే.. టోల్‌ వసూలు చేయొద్దు: గడ్కరీ

ఐపీ అంటే ఇంగ్రెస్‌ ప్రొటెక్షన్‌. తెలుగులో ప్రవేశ రక్షణ అనొచ్చు. సాధారణంగా ఐపీ 67, 68ని స్కేలుగా భావిస్తారు. కానీ ఇందులో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది. IP××లో మూడో క్యారెక్టర్‌ బయట నుంచి వచ్చే ధూళిని ఆపే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది 0 నుంచి 6 వరకు ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ (IEC) రేటింగ్ ప్రకారం.. 5 ఉంటే ‘డస్ట్‌- ప్రొటెక్టెడ్‌’ అని, 6 ఉంటే ‘డస్ట్‌- టైట్‌’ అని అర్థం.  ఇక IP××లో చివరి అక్షరం వాటర్‌ రెసిస్టెంట్‌ను సూచిస్తుంది. దీని రేంజ్‌ 0 నుంచి 9 వరకు ఉంటుంది. ఎంత ఎక్కువ రేటింగ్‌ ఉంటే అంత రక్షణ ఉంటుంది. చివరి క్యారెక్టర్‌లో 7 ఉంటే నీటిలో కొద్దిసేపు తడిసినా ఏం కాదని అర్థం. అదే 8 ఉంటే నీటిలో కొంత లోతుకు చేరినా ఆ డివైజ్‌ తట్టుకోగలదని అర్థం. ఒకటిన్నర మీటరు లోతులో 30 నిమిషాల పాటు ఉన్నా స్మార్ట్‌ఫోన్‌లోకి నీరు చేరకుండా ఆపగలదన్నమాట. ఈ విషయంలో కంపెనీకి, కంపెనీకి మధ్య వ్యత్యాసం ఉంటుంది. ఆ డివైజ్ ఎంతసేపు నీటిలో ఉండగలదు.. ఏమేర లోతు వరకు నీటిని తట్టుకోగలదనే విషయాన్ని కంపెనీలు పేర్కొంటాయి.

ఐపీ రేటింగ్‌ లేకపోతే..?

ఐపీ రేటింగ్‌ పొందాలంటే నిర్దిష్ట నిబంధనలు, ఖరీదైన పరీక్షలు అవసరం. అందుకే కొన్ని కంపెనీలు, ముఖ్యంగా బడ్జెట్‌ ధరలో ఫోన్లను తీసుకొచ్చే కంపెనీలు ఈ రేటింగ్స్‌ జోలికి పోవు. ఈ రేటింగ్‌ లేకుండానే ఫోన్లను లాంచ్‌ చేస్తుంటాయి. అలాగని ఆయా స్మార్ట్‌ఫోన్లకు ధూళి, నీటి నుంచి రక్షణ ఉండదని కాదు. తేమ నుంచి రక్షణ కల్పించడం కోసం రబ్బరైజ్డ్‌ సీల్స్‌ లేదా వాటర్‌ రిపెల్లెంట్‌ నానో కోటింగ్‌ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ఉపయోగిస్తుంటాయి. దీంతో నీటితుంపర్లు పడినా,  పొరపాటున నీటిలో జారినా కొంతమేర రక్షణ ఉంటుంది. ఐపీ రేటింగ్‌ ఉండదు కాబట్టి నీటిలో పడకుండా చూసుకోవడం ఉత్తమం. ఒకవేళ నీటిలో పడితే వారెంటీ వర్తించకుండా పోయే ప్రమాదం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు