PMVVY: నెలకు ₹ 9,250 పెన్షన్ పథకం.. మరికొన్ని నెలలు మాత్రమే!
సాధారణ పెన్షన్ కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లు ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకాన్ని ఎంచుకోవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన నెలకు పింఛను హామీనిచ్చే ప్రధాన మంత్రి వయ వందన యోజన (PMVVY) పథకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీ ఈ పథకాన్ని నిర్వహిస్తోంది. 'PMVVY' అనేది 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లకు ప్రభుత్వం అందించే సబ్సిడీ పెన్షన్ పథకం. కనీస, గరిష్ఠ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించి ప్లాన్‌ని కొనుగోలు చేసిన సీనియర్ సిటిజన్లకు ఈ పథకం తక్షణమే అమల్లోకి వస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక ప్రాతిపదికన పెన్షన్‌ను అందిస్తారు. సాధారణ పెన్షన్ కోసం చూస్తున్న సీనియర్ సిటిజన్లు ఈ పథకాన్ని ఎంచుకోవచ్చు. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే చేతిలో గణనీయమైన మొత్తం ఉండాలి.
'PMVVY'కి అర్హత
దేశంలోని 60 ఏళ్లు పూర్తి అయినవారు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న సీనియర్ సిటిజన్లు 'PMVVY' పథకాన్ని కొనుగోలు చేయవచ్చు. ఈ పథకానికి కొనుగోలు చేయడానికి గరిష్ఠ వయోపరిమితి లేదు. దరఖాస్తుదారుడు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. పాలసీ వ్యవధిలో ఎప్పుడైనా పాలసీని సరెండర్ చేయవచ్చు. అత్యవసర పరిస్థితిలో మెడికల్ ఎమర్జెన్సీ (స్వీయ, జీవిత భాగస్వామి) విషయంలో పాలసీదారులు కొనుగోలు ధరలో 98% ఉపసంహరించుకోవచ్చు.
పాలసీకి కావలసిన పత్రాలు
ఆధార్ కార్డు, పాన్ కార్డు, వయసు రుజువు, చిరునామా, బ్యాంక్ ఖాతా పాస్ బుక్, దరఖాస్తుదారుని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో ముఖ్యంగా కావాలి. ఏదైనా ఎల్ఐసీ బ్రాంచికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారం ఎల్ఐసీ బ్రాంచి వద్ద లభిస్తుంది. లేదా ఎల్ఐసీ అధికారిక వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
పెన్షన్ తీసుకోవడానికి కాలవ్యవధి
'PMVVY' కింద మొదటి విడత పెన్షన్.. పథకం కొనుగోలు తేదీ నుంచి 1 సంవత్సరం, 6 నెలలు, 3 నెలలు, 1 నెల (ఫించనుదారుడు ఎంచుకున్న విధంగా) తర్వాత ప్రారంభమవుతుంది. ఉదా: మీరు నెలవారీ పెన్షన్ చెల్లింపు విధానాన్ని ఎంచుకుంటే.. మీరు ఇప్పడు పథకాన్ని కొనుగోలు చేస్తే 1 నెల తర్వాత మీ పెన్షన్ చెల్లింపులు ప్రారంభమవుతాయి.
మెచ్యూరిటీ ప్రయోజనాలు
'PMVVY' పెన్షన్, మరణ, మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తుంది. ఖాతాదారు ఎంచుకున్న పెన్షన్ విధానంపై ఆధారపడి 'PMVVY' 10 సంవత్సరాల పాలసీ కాలానికి పెన్షన్‌ని అందిస్తుంది. 10 సంవత్సరాల పాలసీ వ్యవధిలో ఫించనుదారుడు మరణిస్తే పాలసీ కొనుగోలు ధర లబ్ధిదారునికి తిరిగి ఇచ్చేస్తారు. ఖాతాదారుడు 10 సంవత్సరాల పాలసీ కాలానికి జీవించి ఉంటే, చివరి వాయిదాతో పాటు కొనుగోలు ధర తిరిగి ఇచ్చేస్తారు.
'PMVVY' వడ్డీ రేటు
ప్రస్తుత వార్షిక వడ్డీ రేటు 7.40%. 2023 మార్చి 31 వరకు ఇదే వడ్డీ రేటు అమలులో ఉంటుంది. పాలసీ కొనుగోలు సమయంలో ఉన్న వడ్డీరేటు.. 10 సంవత్సరాల పూర్తి కాల వ్యవధికి వర్తిస్తుంది.
కనిష్ఠ, గరిష్ఠ పెన్షన్
చందాదారుడు పొందే పెన్షన్ మొత్తం వారి కొనుగోలు ధరపై ఆధారపడి ఉంటుంది. కొనుగోలు ధర రూ.1,62,162 చెల్లిస్తే 'PMVVY' కింద అనుమతించిన కనీస పెన్షన్ నెలకు రూ.1,000 కాగా.. రూ. 15 లక్షలు చెల్లించిన వారికి గరిష్ఠంగా పెన్షన్ నెలకు 9,250 వస్తుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకంలో గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వార్షిక పెన్షన్ ఒకేసారి రూ.1,11,000 కావలసినవారు రూ.14,49,086 పాలసీ కొనుగోలు ధరను చెల్లిస్తే సరిపోతుంది. పాలసీదారుడు ఒకటి కంటే ఎక్కువసార్లు పథకంలో పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ ప్లాన్‌లోని అన్ని పాలసీల కింద ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం కొనుగోలు ధర రూ.15 లక్షలకు మించకూడదు. భార్యభర్తలిద్దరూ సీనియర్ సిటిజన్లయితే ఒక్కొక్కరు రూ. 15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు.
పాలసీ కొనుగోలు ధర, పెన్షన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలకు ఈ కింద పట్టికను చూడండి.
పన్ను మినహాయింపు లేదు
'PMVVY' అనేది పన్ను ఆదా పథకం కాదు. ఈ పథకం ద్వారా వచ్చే రిటర్న్‌లకు వర్తించే పన్ను రేటు ప్రకారం పన్ను విధిస్తారు. కాంట్రిబ్యూషన్‌కి ఆదాయపు పన్ను రాయితీ లేదు. ఈ పథకంలో ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద పాలసీదారులు మినహాయింపును క్లెయిమ్ చేయలేరు. అయితే 'PMVVY' జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంటుంది. పాలసీ కొనుగోలు కోసం.. పాలసీదారు ఆధార్ నంబర్ ధ్రువీకరణను కలిగి ఉండాలి. నెఫ్ట్ లేదా ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా పెన్షన్ చెల్లింపులు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త ఆర్థిక సంవత్సరం ఇలా ప్రారంభిద్దాం...
ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాగానే చాలా విషయాల్లో మార్పులు వస్తుంటాయి. ఆదాయపు పన్ను విషయం కావొచ్చు.. బ్యాంకింగ్ సంబంధిత లావాదేవీలు.. ఇలా ఎన్నో ఏప్రిల్ 1 నుంచి మనకు కొత్తగా కనిపిస్తుంటాయి -
సిప్ ప్రారంభిస్తారా ?ఇవి తెలుసుకోండి..
స్టాక్ మార్కెట్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరుతుండటంతో ఇటీవల కాలంలో చాలామంది ఇందులో మదుపు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మూడేళ్లుగా ఈక్విటీల్లోకి వస్తున్న పెట్టుబడులే ఇందుకు నిదర్శనం -
అత్యవసర నిధి ఖర్చులను తట్టుకునేలా
అవసరాలు ఎప్పుడు ఏ రూపంలో పలకరిస్తాయో చెప్పలేం. ఇలా వచ్చేవాటిని తట్టుకునేందుకు ఆర్థికంగా సిద్ధంగా ఉండాల్సిందే. నెలనెలా ఆదాయం వచ్చేదాకా వీటిని వాయిదా వేయలేం. -
31లోగా ఇవి పూర్తి చేయండి..
ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం.. -
విశ్రాంత జీవితంలో తోడుగా
పదవీ విరమణ తర్వాత ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవకుండా, స్థిరమైన ఆదాయాన్ని అందించే పదవీ విరమణ పథకాలపై మదుపరుల్లో ఆసక్తి పెరుగుతోంది -
చిన్న, మధ్యస్త REITS ద్వారా స్థిరాస్తిలో పెట్టుబడులు.. సురక్షితమేనా?
తరతరాలుగా భారతీయులు స్థిరాస్తి, బంగారం వంటి సంప్రదాయ పెట్టుబడులను గౌరవిస్తున్నారు. మారుతున్న కాలంలో స్థిరాస్తి పెట్టుబడులకు మారో రూపమే SM REITS.. వీటి గురించి తెలుసుకోండి. -
PPF vs VPF: పీపీఎఫ్, వీపీఎఫ్‌లో ఏది బెటర్..?
PPF or VPF: వాలంటరీ ప్రావిడెండ్ ఫండ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో ఏది బెటర్ అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాల్ని పరిశీలించాక మీ నిర్ణయం తీసుకోండి.. -
Foreign Trip: విదేశీ టూర్‌ను ఇబ్బంది లేకుండా ఎలా ప్లాన్ చేసుకోవాలి?
విదేశీ వెకేషన్‌ను ప్లాన్ చేయడానికి అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రయాణం ఇబ్బంది లేకుండా, సజావుగా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. -
Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్ రేషియో ఎంతెంత?
దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్మెంట్ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి. -
కుటుంబానికి ధీమానిచ్చేలా.. బీమా పాలసీ
సంపాదించిన మొత్తంలో నుంచి పొదుపు, పెట్టుబడులకు కొంత కేటాయిస్తుంటాం. కుటుంబానికి ఆర్థికంగా అవసరమైన లక్ష్యాల సాధనకు ఇవి ఉపయోగడేలా చూసుకుంటాం. -
పన్ను ఆదా ఇలా చేద్దాం
ఆర్థిక సంవత్సరం ముగింపు దగ్గరకు వచ్చేసింది. పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు తమ పొదుపు,పెట్టుబడులను వెంటనే పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. -
డెట్ ఫండ్లలో మదుపు చేస్తున్నారా?
ఈక్విటీ మార్కెట్లలో అనిశ్చితి కనిపిస్తుండటంతో చాలామంది సురక్షిత పథకాలపై దృష్టి సారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిలో మదుపు చేసేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలను తెలుసుకుందాం. -
Credit cards: క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్!
Credit Cards: క్రెడిట్ కార్డుల విషయంలో ఏప్రిల్ 1 నుంచి మార్పులు రానున్నాయి. రివార్డులు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ విషయంలో బ్యాంకులు కీలక మార్పులు చేపట్టాయి. -
Health Insurance Claims: ఆరోగ్య బీమా క్లెయిమ్ విషయంలో ఈ తప్పులు చేయొద్దు!
Insurance claims: ఆరోగ్య బీమా క్లెయిమ్‌లు కొన్నిసార్లు తిరస్కరణకు గురవుతుంటాయి. కాబట్టి ఈ తప్పులు చేయొద్దు.. -
Health Emergency: ఆరోగ్య అత్యవసర పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి?
జీవితంలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా దాన్ని ఎదుర్కోడానికి మనం ఆర్థికంగా సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోండి.. -
Mutual Funds: మ్యూచువల్ ఫండ్ల ఉపసంహరణ సమస్య.. ఎన్ని రోజులు పడుతోందంటే?
మార్కెట్లలో మిడ్, స్మాల్‌క్యాప్ ఫండ్లలో ఉన్న తమ నిధులను మదుపుదార్లు ఉపసంహరించుకున్నప్పుడు నిధుల బదిలీకి వివిధ సంస్థలు కొంత సమయాన్ని తీసుకుంటున్నాయి. ఎంత మొత్తం ఉపసంహరణకు.. ఎంత సమయం తీసుకుంటున్నాయో ఇక్కడ చూడండి. -
Insurance Agent: బీమా ఏజెంట్‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి?
చాలా మందికి వారి వ్యక్తిగత జీవితంలో బీమా చాలా అవసరం. పాలసీ కొనుగోలు సమయంలో ఏజెంట్/అడ్వైజర్ అవసరం పడొచ్చు. వీరి గురించి ఇక్కడ తెలుసుకోండి. -
ఆరోగ్య బీమా రోజువారీ ఖర్చులను అందించేలా...
వైద్య ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఆరోగ్య బీమా రంగంలోనూ ఎన్నో మార్పులు వస్తున్నాయి. -
స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గుల్లో అప్రమత్తంగా
స్టాక్ మార్కెట్ అంటేనే అనిశ్చితికి మారు పేరు. చిన్న వార్త వచ్చినా దానికి ప్రతికూలంగానో, అనుకూలంగానో స్పందిస్తుంటాయి. ఒక్క రోజులోనే మదుపరుల సంపద కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆవిరవుతుంది. -
స్థిరాస్తి రంగంలో...
హెచ్డీఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ కొత్తగా హెచ్డీఎఫ్సీ నిఫ్టీ రియాల్టీ ఇండెక్స్ ఫండ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ (ఎన్ఎఫ్ఓ) ఈ నెల 21న ముగుస్తుంది. -
Health Insurance: విదేశాల్లో విద్యనభ్యసించే విద్యార్ధుల కోసం ఆరోగ్య బీమా
విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరోగ్య బీమా తప్పనిసరి. భారత్‌లో ప్రముఖ బీమా సంస్థలు విదేశీ విద్యార్థులకు అందించే బీమా సౌకర్యాలు ఇక్కడ తెలుసుకుందాం.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్