కొవిడ్‌తో మరణిస్తే పదవీ విరమణ వయసు వరకూ వేతనం చెల్లిస్తాం: వేదాంతా
కొవిడ్-19తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు సదరు ఉద్యోగి పదవీ విరమణ వయసు వరకు, చివరి నెల తీసుకున్న వేతనాన్ని స్థిర (ఫిక్స్డ్) వేతనంగా అందిస్తామని వేదాంతా వెల్లడించింది. తమ వ్యాపార భాగస్వాములు ఎవరైనా కొవిడ్‌తో మరణిస్తే వారి కుటుంబాలకు
దిల్లీ: కొవిడ్-19తో మరణించిన తమ ఉద్యోగుల కుటుంబాలకు సదరు ఉద్యోగి పదవీ విరమణ వయసు వరకు, చివరి నెల తీసుకున్న వేతనాన్ని స్థిర (ఫిక్స్డ్) వేతనంగా అందిస్తామని వేదాంతా వెల్లడించింది. తమ వ్యాపార భాగస్వాములు ఎవరైనా కొవిడ్‌తో మరణిస్తే వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని తెలిపింది. వేదాంతా కుటుంబం, తమ వ్యాపార భాగస్వాముల కోసం గంపగుత్తగా టీకాలు కొనుగోలు చేసేందుకు రూ.12.6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు పేర్కొంది. వైద్య బీమా కవర్ కూడా ప్రస్తుతం ఉన్న దాని కంటే 1.5 రెట్లు పెంచుతున్నామని, వ్యాపార భాగస్వాములకు కొవిడ్ కవచ్ బీమా సదుపాయం కల్పిస్తున్నామని వివరించింది.
టైమ్స్ గ్రీన్ ఎనర్జీ ఐపీఓ 16 నుంచి
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు ప్రారంభించి, నిర్వహిస్తున్న టైమ్స్ గ్రీన్ ఎనర్జీ (ఇండియా) తొలి పబ్లిక్ ఇష్యూ ఈ నెల 16న ప్రారంభమై 22న ముగియనుంది. రూ.4.05 కోట్ల మేరకు సమీకరించాలన్నది సంస్థ యత్నం. రూ.10 ముఖ విలువగల షేరు ధర రూ.61గా నిర్ణయించింది. ఈ సంస్థ వ్యవసాయ ఉత్పత్తులతో పాటు, మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వస్తువులనూ ఉత్పత్తి చేస్తోంది. 2019-20లో రూ.20 కోట్ల టర్నోవర్ సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్