FD Intrest rates: ఎన్‌బీఎఫ్‌సీల్లో ఎఫ్‌డీ రేట్లు.. ఎందులో ఎంతెంతంటే..?

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సంవ‌త్స‌రానికి 5.75% నుండి 7.48% మ‌ధ్య వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి.

Updated : 13 Dec 2021 15:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్ర‌ముఖ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు డిపాజిట్ల‌ వ‌డ్డీ రేట్లు త‌గ్గ‌డంతో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ)ల‌ ఫిక్స్‌డ్ డిపాజిట్లు మ‌దుప‌ర్ల‌లో ప్రాచుర్యం పొందాయి. ఈ కంపెనీలు బ్యాంకులు ఇచ్చే వ‌డ్డీ రేట్ల కంటే ఎక్కువ వ‌డ్డీ ఇస్తున్నాయి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, కంపెనీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై సంవ‌త్స‌రానికి 5.75% నుంచి 7.48% మ‌ధ్య వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. ఇది బ్యాంక్ ఎఫ్‌డీలు, బ్యాంక్ సేవింగ్స్ డిపాజిట్ల‌లో పొందేదానికంటే ఎక్కువ‌. కార్పొరేట్ ఎఫ్‌డీల కాల‌ప‌రిమితి 12 నెల‌ల నుంచి 120 నెల‌ల మ‌ధ్య ఉంటుంది.

వీటిలో పెట్టుబడి పెట్టేముందు కంపెనీ ఎఫ్‌డీల క్రెడిట్ రేటింగ్‌ల‌ను త‌న‌ఖీ చేయ‌డం మ‌ర్చిపోకూడ‌దు. క్రిసిల్‌, ఇక్రా, కేర్ మొద‌లైన ఏజెన్సీల నుంచి ‘ఏఏఏ’ రేటింగ్‌ల‌ను క‌లిగి ఉన్న కంపెనీల‌లో మాత్ర‌మే పెట్టుబ‌డి పెట్టాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. మ‌దుప‌ర్ల‌కు స‌కాలంలో డిపాజిట్ల‌ను చెల్లించే సంస్థ‌ల‌కు మంచి సామ‌ర్థ్యం ఉన్న‌ట్టు తెలిపే ఈ రేటింగ్‌ల‌ను రేటింగ్ సంస్థ‌లు ఇస్తున్నాయి. టాప్ రేటింగ్ కంపెనీ ఎఫ్‌డీలను సుర‌క్షితంగా పరిగణిస్తారు. బ్యాంక్ ఎఫ్‌డీల మాదిరిగానే ఎన్‌బీఎఫ్‌సీ ఎఫ్‌డీల‌పై మీరు సంపాదించే వ‌డ్డీపై స్లాబ్ ప్ర‌కారం ఆదాయ‌పు ప‌న్ను విధిస్తారు.

రూ.కోటి కంటే త‌క్కువ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీని అందిస్తున్న టాప్ 10 హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, ఎన్‌బీఎఫ్‌సీల జాబితా ఈ పట్టికలో అందిస్తున్నాం.

కార్పొరేట్ కంపెనీలు సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు 0.25% అద‌న‌పు వ‌డ్డీ రేటును ఇస్తున్నాయి. శ్రీ‌రామ్ సిటీ యూనియ‌న్‌, శ్రీ‌రామ్ ట్రాన్స్‌పోర్ట్ 0.40% దాకా అద‌నంగా వ‌డ్డీ ఇస్తుండగా.. సుంద‌రం హోమ్ ఫైనాన్స్‌, సుంద‌రం ఫైనాన్స్ 0.50% వ‌డ్డీని అద‌నంగా ఇస్తున్నాయి.

గ‌మ‌నిక: ఈ కార్పొరేట్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌లో పెట్టుబ‌డి పెట్టే ముందు ఆయా కంపెనీల వెబ్‌సైట్‌లలో ఎఫ్‌డీ రేటింగ్‌ను త‌ప్ప‌క ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. ఏఏఏ రేటింగ్ ఉన్న కంపెనీల్లో డిపాజిట్లు పెట్ట‌డం మేలు. బ్యాంకింగ్ నిపుణుల స‌ల‌హా తీసుకుంటే మంచిది. వడ్డీ రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి సరిచూసుకోవడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని