Credit Card: ఈ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు హోల్డర్లకు ₹ 3 లక్షల వరకు బీమా..!

ప్రైవేటు రంగానికి చెందిన ఫెడరల్‌ బ్యాంకు..క్రెడిట్‌కార్డు వినియోగదారుల కోసం ‘గ్రూప్‌ క్రెడిట్‌ షీల్డ్‌’ ను ఏజిస్ ఫెడరల్‌ లైఫ్ ఇన్సురెన్స్‌ భాగస్వామ్యంతో  ప్రారంభించింది.

Updated : 01 Nov 2022 14:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రైవేట్‌ రంగానికి చెందిన ఫెడరల్‌ బ్యాంకు.. క్రెడిట్‌కార్డు వినియోగదారుల కోసం ‘గ్రూప్‌ క్రెడిట్‌ షీల్డ్‌’ను ప్రారంభించింది. ఏజిస్ ఫెడరల్‌ లైఫ్ ఇన్సురెన్స్‌ భాగస్వామ్యంతో ఈ సదుపాయాన్ని బ్యాంక్‌ అందిస్తోంది. ఇందులో భాగంగా క్రెడిట్‌ కార్డుదారులకు వారి క్రెడిట్‌ పరిమితికి సమానమైన లైఫ్‌ కవరేజీని గరిష్ఠంగా రూ. 3 లక్షల వరకు పొందొచ్చు. అంటే, క్రెడిట్‌ కార్డుదారుల క్రెడిట్‌ లిమిట్‌ రూ.3 లక్షల కంటే ఎక్కువగా ఉన్నా.. రూ.3 లక్షల వరకు మాత్రమే కవరేజీ లభిస్తుంది.

ఇది సింగిల్‌ ప్రీమియం ప్లాన్‌. ఒక సంవత్సరం కాలపరిమితితో వస్తుంది. ఫెడరల్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డుదారులు ఈ ప్లాన్‌ కోసం అదనపు పత్రాలు ఇవ్వాల్సిన  అవసరం లేదు. అలాగే, వైద్య పరీక్షలు చేయించనవసరం లేదు. గ్రూప్‌ క్రెడిట్‌ షీల్డ్‌ ప్లాన్‌ పూర్తిగా డిజిటల్‌ ప్రాసెస్‌లో అందుబాటులో ఉంటుంది. కేవలం కొన్ని క్లిక్స్‌తోనే 3 నిమిషాల్లో ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. కాబట్టి, వినియోగదారులు సులభంగా కార్డు యాక్సెస్ చేయడంతో పాటు వారికి జీవిత బీమాతో రక్షణ, భద్రత లభిస్తుందని బ్యాంకు తెలిపింది. ప్రస్తుతం ఫెడరల్‌ బ్యాంకు వీసా, మాస్టర్‌ కార్డు, రూపేతో కలిసి సెలెస్టా, ఇంపీరియా, సిగ్నెట్‌ అనే మూడు రకాల క్రెడిట్‌ కార్డులను అందిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని