Xiaomi: షావోమికి ఈడీ షాక్‌.. రూ.5,500 కోట్ల నిధులు సీజ్‌!

చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షావోమికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) షాకిచ్చింది. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (FEMA) నిబంధనల ఉల్లంఘిన కింద ఆ కంపెనీకి చెందిన రూ.5,551 కోట్ల నిధులను సీజ్‌ చేసింది.

Published : 30 Sep 2022 20:00 IST

దిల్లీ: చైనా మొబైల్‌ తయారీ కంపెనీ షావోమికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) షాకిచ్చింది. ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ మేనేజ్‌మెంట్‌ యాక్ట్‌ (FEMA) నిబంధనల ఉల్లంఘిన కింద ఆ కంపెనీకి చెందిన రూ.5,551 కోట్ల నిధులను సీజ్‌ చేసింది. ఈడీ చరిత్రలో ఇంత మొత్తంలో నగదును సీజ్‌ చేయడం ఇదే తొలిసారి. ఫెమా చట్టం కింద ఈ మొత్తాన్ని ఏప్రిల్‌ 29నే ఈడీ జప్తుచేసి కాంపిటెంట్‌ అథారిటీకి ఆమోదం కోసం పంపగా.. తాజాగా అథారిటీ ఆమోదం తెలిపింది. రాయల్టీ పేరుతో విదేశాలకు నిధులు మళ్లించడం ఫెమా నిబంధనల కింద తీవ్రమైన నేరమని ఈడీ పేర్కొంది.

ఎంఐ, షావోమి ఇండియా పేరుతో షావోమి గ్రూప్‌ భారత్‌లో గత కొన్నేళ్లుగా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, రూ.5,551.27 కోట్ల సమానమైన విదేశీ నిధులను మూడు విదేశాల్లో పనిచేస్తున్న కంపెనీలకు షావోమి ఇండియా పంపించింది. షావోమి గ్రూప్‌తో పాటు అమెరికాలో ఉన్న మరో రెండు సంస్థలకు ఈ నిధులు చేరాయి. మాతృక సంస్థ ఆదేశాలతోనే రాయల్టీల రూపంలో ఈ భారీ మొత్తాన్ని ఆ సంస్థ బదిలీ చేసింది. సదరు సంస్థల నుంచి ఎలాంటి సేవలనూ పొందకుండానే రాయల్టీ పేరుతో ఈ నగదును పంపించింది. ఇది ఫెమా చట్ట నిబంధనలకు విరుద్ధమే కాకుండా, బ్యాంకులను తప్పుదోవ పట్టించి ఈ నిధులను విదేశాలకు చేరవేసిందని ఈడీ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని