Automobile sales: పండుగ సీజన్‌లో వాహన విక్రయాలు రయ్‌ రయ్‌!

Automobile sales: అక్టోబరు వాహన రిటైల్‌ విక్రయాల్లో భారీ వృద్ధి నమోదైంది. పండుగ సీజన్‌ నేపథ్యంలోనే అమ్మకాలు గణనీయంగా పెరిగాయని ఫాడా తెలిపింది.

Published : 07 Nov 2022 15:33 IST

దిల్లీ: పండుగ సీజన్‌ నేపథ్యంలో అక్టోబరులో వాహన విక్రయాలు గణనీయంగా పెరిగాయి. క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే రిటైల్‌ అమ్మకాల్లో 48 శాతం వృద్ధి నమోదైనట్లు వాహన డీలర్ల సమాఖ్య ఫాడా తెలిపింది. 2021 అక్టోబరులో 14,18,726 వాహనాల రిజిస్ట్రేషన్‌ జరగ్గా.. గత నెలలో అవి 20,94,378 యూనిట్లకు చేరాయి. కొవిడ్‌ మునుపటి విక్రయాలతో పోల్చినా అమ్మకాలు 8 శాతం పెరిగాయి. ప్రయాణ, వాణిజ్య, ద్విచక్ర, ట్రాక్టర్లు, త్రిచక్ర.. ఇలా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదు కావడం విశేషం.

ప్రయాణికుల వాహనాల రిటైల్‌ విక్రయాలు 41 శాతం పెరిగి 3,25,645 యూనిట్లకు చేరాయి. ద్విచక్ర వాహనాల్లో 51 శాతం వృద్ధితో 15,71,165 యూనిట్లు, వాణిజ్య వాహనాల విక్రయాలు 25 శాతం ఎగబాకి 74,443 యూనిట్లుగా నమోదయ్యాయి. త్రిచక్ర వాహన విక్రయాల్లో 66 శాతం, ట్రాక్టర్‌ అమ్మకాలు 17 శాతం పెరిగాయి. పండుగ సీజన్‌ నేపథ్యంలో విక్రయాలు భారీగా పుంజుకోవడంతో పరిశ్రమలో ఉత్సాహకరమైన వాతావరణం నెలకొందని ఫాడా పేర్కొంది.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని