Fevicol: ఇది కదా మార్కెటింగ్‌ స్ట్రాటజీ అంటే!

సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం గురించి వినే ఉంటాం. ఈ ఫెవికాల్‌ ప్రకటన చూస్తే మాత్రం దానర్థం ఇదేనా.....

Updated : 18 Aug 2022 16:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం గురించి వినే ఉంటాం. ఈ ఫెవికాల్‌ ప్రకటన చూస్తే మాత్రం దానర్థం ఇదేనా అనిపించకమానదు. సరిగ్గా అదే చేసింది ఈ సంస్థ. కాకపోతే ఇక్కడ సంక్షోభం వేరొకరిది. అవకాశం మాత్రం తనది! దీంతో ఫెవికాల్‌ సమయస్ఫూర్తిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదీ విషయం.. ప్రముఖ ఫుట్‌బాలర్‌ క్రిస్టియానో రొనాల్డో ఇటీవల ఓ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వ్యవహరించిన తీరు కోకాకోలా కంపెనీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. తన ముందున్న కోక్‌ బాటిళ్లను పక్కన పెట్టి నీరు తాగడంటూ ఇచ్చిన సంజ్ఞ ఆ కంపెనీకి రూ.29వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దీన్నే తాజాగా ఫెవికాల్‌ తనకు అనుకూలంగా మలుచుకుంది. ప్రెస్‌కాన్ఫరెన్స్‌ టేబుల్‌పై కోక్‌ బాటిళ్ల బదులు రెండు ఫెవికాల్‌ బాటిళ్లను ఉంచి.. ‘దీన్నెవరు జరపలేరు.. విలువ పడిపోదు’ అనే వ్యాఖ్యను జోడించింది. దీనిపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఫెవికాల్‌ అద్భుతమైన మార్కెటింగ్‌ వ్యూహం అనుసరించిందంటూ ప్రముఖ వ్యాపారవేత్త హర్షా గొయెంకా ప్రశంసిస్తూ ట్వీట్‌ చేశారు. క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. ఒకవేళ ఫెవికాల్‌ వేసిన కుర్చీలో రొనాల్డో కూర్చుని ఉంటే పరిస్థితి ఏంటో! అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని