ITR: పన్ను ప‌రిధిలోకి రాని వారు రిటర్నులు దాఖ‌లు చేసి ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

ఒక వ్య‌క్తి వేతనం, వృత్తి, అద్దె లేదా వ్యాపారం ఏ విధంగానైనా ప్రాథ‌మిక మిన‌హాయింపు ప‌రిమితికి మించిన ఆదాయం ఉంటే ఆదాయ ప‌న్ను రిట‌ర్నులు (ఐటీఆర్‌) దాఖ‌లు చేయాలి. రూ. 2.50 ల‌క్ష‌ల‌కు మించి ఆదాయం ఉన్న వ్య‌క్తులు భార‌త‌దేశంలో ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. రూ. 1 ల‌క్ష‌కు పైగా విద్యుత్ బిల్లులు, రూ. 2 ల‌క్ష‌ల‌కు పైగా విదేశీ ప్ర‌యాణాల‌కు ఖ‌ర్చు చేసే వారు కూడా ప‌న్ను రిట‌ర్నులు దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. చాలామంది తాము ఆదాయ‌పు ప‌న్ను మిన‌హాయింపుల ప‌రిధిలోనే ఉన్నాము కాబ‌ట్టి ఐటీఆర్ దాఖ‌లు చేయాల్సిన అవ‌స‌రం లేద‌నుకుంటారు. కానీ ప‌న్ను చెల్లించ‌డం, ఐటీఆర్ దాఖ‌లు చేయ‌డం రెండు వేర్వేరు చ‌ట్ట‌ప‌ర‌మైన బాధ్య‌త‌లు. ఉదాహరణకు, కొన్ని సందర్భాల్లో మీ స్థూల మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించి ఉండవచ్చు, కానీ వివిధ తగ్గింపుల కారణంగా, పన్ను విధించదగిన ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువకు రావచ్చు. అప్పుడు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండ‌దు. కానీ ఇక్క‌డ ఐటీఆర్ దాఖ‌లు చేయాలి. అదేవిధంగా, సెక్షన్ 87A కింద అందుబాటులో ఉన్న రిబేటు కారణంగా మీ నికర పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం ఐదు లక్షలకు మించకపోతే మీకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవ‌స‌రం లేక‌పోయినా, ఐటీఆర్‌ని దాఖ‌లు చేయాల్సి రావచ్చు.

ఒక‌వేళ మీకు ప‌న్ను ప‌రిధి కంటే త‌క్కువ ఆదాయం ఉన్న‌ప్ప‌టికీ, ఐటీఆర్ ఫైల్ చేయ‌వ‌చ్చు. ఇలా ఫైల్ చేయ‌డం వ‌ల్ల కొన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 
1. రుణాలు సుల‌భంగా ల‌భిస్తాయి..
ఐటీ రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌డం వ‌ల్ల మీ రుణ ప్రాసెస్ త్వ‌ర‌గా పూర్త‌వుతుంది. రుణ ద‌ర‌ఖాస్తు కోసం కావ‌ల్సిన ప‌త్రాల‌లో ఐటి రిట‌ర్నులు కీల‌కం. ఉదాహ‌ర‌ణ‌కి, మీరు ఇళ్లు లేదా వాహ‌న కొనుగోలుకు రుణం కోసం బ్యాంకుకు ద‌రఖ‌స్తు చేసుకుంటే.. ఆదాయాన్ని, ఆదాయ‌ మార్గాన్ని త‌నిఖి చేసేందుకు బ్యాంకులు మిమ్మ‌ల్ని మూడు సంవ‌త్స‌రాల ఐటి-రిట‌ర్నుల‌ను కోర‌తాయి. వీటి ద్వారా ద‌ర‌ఖాస్తు దారుని చెల్లింపు సామ‌ర్థ్యాన్ని అంచ‌నా వేసి ఎంత వ‌ర‌కు రుణం మంజూరు చేయ‌వ‌చ్చో ఒక అవ‌గాహ‌న‌కు వ‌స్తాయి.  

2. బీమా, క్రెడిట్ కార్డుల కోసం..
ఇన్సురెన్స్‌, క్రెడిట్ కార్డుల విష‌యంలో వ్యక్తుల ఆదాయం తెలుసుకోవ‌డం సంస్థ‌ల‌కు ముఖ్యం. వ్య‌క్తి ఆదాయాన్ని బ‌ట్టి ఎంత వ‌ర‌కు క‌వ‌రేజ్ అందించాలి అని సంస్థ‌లు నిర్థారించుకుంటాయి. అలాగే, క్రెడిట్ కార్డు బిల్లుల‌ను స‌మ‌యానికి చెల్లించ‌గ‌ల‌రా అని చూస్తాయి. ఇంద‌కు వ్య‌క్తులు ఆదాయ రుజువుగా ఐటీఆర్ ప‌త్రాల‌ను ఇవ్వ‌చ్చు. 

3. వీసా ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో..
ఉద్యోగం, లేదా వ్యాపార కార్య‌క‌లాపాల‌ నిమిత్తం విదేశాల‌కు వెళ్లాల‌ని ప్లాన్ చేస్తున్న‌వారు వీసా దర‌ఖాస్తు, ప్రాసెస్ సుల‌భంగా పూర్తి చేసేందుకు ఐటీ రిట‌ర్నులు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇమ్మిగ్రేష‌న్ అధికారులు గ‌త‌ 2,3 ఏళ్ల ఐటీ రిట‌ర్నుల కాపీల‌ను అడుగుతారు. యూఎస్‌, కెన‌డా, యూకే వంటి కొన్ని రాయబార కార్యాల‌యాలు వ్య‌క్తుల ప‌న్ను రిట‌ర్నుల రికార్డుల‌ను ప్ర‌త్యేకంగా ప‌రిశీలిస్తాయి. 

4. ప‌న్ను రిఫండ్ క్లెయిమ్ చేసేందుకు..
ట‌ర్మ్ డిపాజిట్‌, డివెడెండ్ల వంటి మార్గాల ద్వారా ఆదాయం పొందే వారు రిఫండ్ కోసం ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఐటీఆర్ ఫైల్ చేయ‌డం ద్వారా కేవైసి పూర్తి చేసి, బ్యాంకు ఖాతాకు రిఫండ్ పొంద‌వ‌చ్చు.

5. న‌ష్టాలు క్లెయిమ్ చేసేందుకు..
మూల‌ధ‌న న‌ష్టాలు, వ్యాపారం, వృత్తి మొద‌లైన వాటి నుంచి వ‌చ్చే న‌ష్టాలను క్లెయిమ్ చేసేందుకు గ‌డువు తేది లోపుగా ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. భ‌విష్య‌త్తు సంవ‌త్స‌రాల్లో న‌ష్టాలను క్లెయిమ్ చేసేందుకు ఈ రిట‌ర్నులు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఉదాహ‌ర‌ణ‌కి, మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్వీటీ షేర్లులో మ‌దుపు చేసే మ‌దుప‌ర్లు లాభాలు ఆర్జించితే ప‌న్ను రిట‌ర్నులు స‌కాలంలో దాఖ‌లు చేయ‌డం వ‌ల్ల గ‌తంలో వ‌చ్చిన న‌ష్టాల‌తో ఈ లాభాలను స‌ర్దుబాటు చేయ‌వ‌చ్చు. 

6. ఆదాయ రుజువుగా పనిచేస్తుంది..
జీతం ద్వారా ఆదాయం పొందే వారు ఆదాయం రుజువుగా ఫారమ్ 16 సర్టిఫికేట్ చూపించ‌వ‌చ్చు. కానీ స్వ‌యం ఉపాధి పొందే వారికి ఈ అవకాశం లేదు. ఆదాయ‌పు ప‌న్ను రిట‌ర్నులు స్వ‌యం ఉపాధి పొందుతున్న‌ పన్ను చెల్లింపుదారులకు ఆదాయ రుజువుగా ప‌నిచేస్తాయి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని