మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ల‌లో తప్పుల‌ను ఎలా సరిదిద్దాలో తెలుసుకోండి

మొద‌ట‌ రిట‌ర్నులు ఆఫ్‌లైన్‌లో దాఖ‌లు చేస్తే త‌ర్వాత ఆన్‌లైన్‌లో స‌వ‌రించుకునేందుకు వీలుండ‌దు  

Published : 18 Dec 2020 14:25 IST

పన్ను చెల్లింపుదారుడు ఆదాయ ప‌న్ను రిట‌ర్నుల‌లో ఏదైనా పొరపాటు లేదా ముఖ్యమైన వివరాలను మ‌రిచిపోవ‌డం వంటివి జ‌రిగిన‌ప్పుడు నిర్ణీత కాలపరిమితిలో ఆదాయపు పన్ను శాఖ యొక్క ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా దాన్ని సరిదిద్దవచ్చు. ఇటువంటి స‌రిచేసిన‌ ఐటిఆర్ ఎప్పుడైనా మ‌దింపు సంవత్సరంలో లేదా అంత‌కుముందే దాఖలు చేయవచ్చు.

మొద‌ట‌ రిట‌ర్నులు ఆఫ్‌లైన్‌లో దాఖ‌లు చేస్తే త‌ర్వాత ఆన్‌లైన్‌లో స‌వ‌రించుకునేందుకు వీలుండ‌దు.సవరించిన ఐటీఆర్‌ అంటే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 (5) కింద దిద్దుబాట్లతో కొత్త ఐటిఆర్‌ను దాఖలు చేయడం.

ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా సవరించిన ఐటిఆర్‌ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడం ఎలాగో తెలుసుకోండి:

  1. ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లండి
  2. మీ పాన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
  3. మొద‌ట‌ ‘e-File’ క్లిక్ చేసి ‘Income Tax Return’ లింక్‌పై క్లిక్ చేయండి
  4. ఆదాయపు పన్ను రిటర్న్ పేజీలో, మీ పాన్ సంఖ్య క‌నిపిస్తుంది. అక్క‌డ మ‌దింపు సంవ‌త్స‌రం (అసెస్‌మెంట్ ఇయ‌ర్‌), ఐటిఆర్ ఫారం నంబర్‌ను ఎంచుకోండి
  5. తరువాత, ‘Filing Type’ గా ’ Original/Revised Return’ ఎంచుకోండి
  6. 'Prepare and Submit Online పై క్లిక్ చేయండి
  7. ఆన్‌లైన్ ఐటీఆర్ ఫారమ్‌లో ‘General Information’ tab, లో 'Return Filing Section’‌ ఎంచుకోండి , 'Revised return under Section 139(5)స లో భాగంగా 'Return filing type’లో ‘Revised’ ఎంచుకోండి.
  8. అసలు ఐటిఆర్ 'రసీదు సంఖ్య‌ , ‘దాఖలు చేసిన తేదీ’ నమోదు చేయండి.
  9. సంబంధిత వివరాలను పూరించడం లేదా స‌రిదిద్దిన త‌ర్వాత ఐటీఆర్ సమర్పించండి
  10. రిట‌ర్నులు ఇ-వెరిఫై చేసుకోండి
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని