GST Collections: జనవరిలో భారీగా జీఎస్టీ వసూళ్లు.. మళ్లీ ₹ 1.55 లక్షల కోట్లకు పైనే!

2023 జనవరిలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. క్రితం ఏడాదితో జనవరితో పోలిస్తే ఈ వసూళ్లు 24శాతం అధికం.

Published : 31 Jan 2023 22:23 IST

దిల్లీ: దేశంలో వస్తు, సేవల పన్ను వసూళ్లు(GST collections) మరోసారి భారీగా నమోదయ్యాయి. జనవరి 31 సాయంత్రం 5గంటల వరకు దేశ వ్యాప్తంగా రూ.1.55 లక్షల కోట్లకు పైగా వసూలైనట్టు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ వెల్లడించింది. జీఎస్టీ(GST) అమల్లోకి వచ్చిన తర్వాత ఇంత భారీ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం ఇది రెండోసారి. గతేడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.68 లక్షల కోట్లు వసూలయ్యాయి. మరోవైపు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ వసూళ్లు రూ.1.50లక్షల కోట్ల మార్కును దాటడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

 జనవరిలో మొత్తంగా రూ.1,55,922 కోట్లు వసూలు కాగా.. సీజీఎస్టీ కింద రూ.28,963 కోట్లు; ఎస్‌జీఎస్టీ కింద రూ.36,730 కోట్లు వసూలైనట్టు కేంద్రం తెలిపింది. ఇకపోతే.. ఐజీఎస్టీ కింద రూ.79,599 కోట్లు సమకూరగా.. రూ.10,630 కోట్లు సెస్సుల రూపంలో వసూలైనట్లు వెల్లడించింది. ఈ గణాంకాలు సాయంత్రం 5గంటల వరకు వచ్చినవే గనక జనవరి మాసానికి సంబంధించి జీఎస్టీ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు