పెట్టుబ‌డుల‌కు ఆర్థిక అవ‌గాహ‌న అవ‌స‌ర‌మా ?

పెట్టుబ‌డుల గురించి స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకోవాలంటే ఆర్థిక‌ప్ర‌ణాళిక, పెట్టుబ‌డులు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మార్కెట్ల‌పై ప్ర‌భావితం చేసే అంశాల గురించి క‌నీస అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇవేమి తెలీకుండా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు.....

Published : 17 Dec 2020 16:49 IST

మార్కెట్ల‌లో పెట్టుబ‌డులు పెట్టేముందు క‌నీస అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌నే చెప్తున్నారు నిపుణులు

పెట్టుబ‌డుల గురించి స‌రైన నిర్ణ‌యాన్ని తీసుకోవాలంటే ఆర్థిక‌ప్ర‌ణాళిక, పెట్టుబ‌డులు, ఆర్థిక వ్య‌వ‌స్థ‌, మార్కెట్ల‌పై ప్ర‌భావితం చేసే అంశాల గురించి క‌నీస అవ‌గాహ‌న అవ‌స‌ర‌మ‌ని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇవేమి తెలీకుండా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే మొద‌టికే మోసం వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. మీరు పెట్టుబ‌డులు చేయ‌బోయే స్టాక్‌ల రాబ‌డుల గురించి మీకు న‌మ్మ‌కం క‌లిగిప్పుడు మాత్ర‌మే ప్రారంభించ‌డం మంచిద‌ని వారి స‌ల‌హా. మ‌దుప‌ర్లు పెట్టుబ‌డుల నిర్వ‌హ‌ణ గురించి తెలుసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కష్ట‌ప‌డి సంపాదించిన డ‌బ్బును ఎందులో పెట్టుబ‌డిగా పెడుతున్నారు? ఎందుకు పెడుతున్నారు? మీ ఆర్థిక ల‌క్ష్యం గురించి స్ప‌ష్ట‌త ఉండాలి. పెట్టుబ‌డులు విష‌యంలో ఆర్థిక స‌ల‌హాదారుని సూచ‌న తీసుకోవ‌డం మంచిది. అయితే దీనితో పాటు ఆర్థిక వ్య‌వ‌స్థ‌, పెట్టుబ‌డుల గురించి తెలుసుకోవ‌డం అవ‌స‌రం. ఎంతో ఉన్న‌త స్థానాల్లో ఉన్న‌వారికి కూడా ఆర్థిక విధానం గురించి క‌నీస అవ‌గాహ‌న ఉండ‌దు. కానీ పెట్టుబ‌డులు పెట్టాల‌నుకునేవారు మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ తీరు, పెట్టుబ‌డుల‌పై ప్ర‌భావం చూపే అంశాలు ఏమిటో క‌చ్చితంగా తెలుసుకొని తీరాలి.

ఎలా తెలుసుకోవాలి?

పెట్టుబ‌డుల అర్థం కాక‌పోవ‌డానికి అదేమీ రాకెట్ సైన్స్ కాదు. అందరూ తెలుసుకోవాల్సిన క‌నీస విషయం. ఈ రోజుల్లో దీని గురించి తెలుసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. సోష‌ల్ మీడియా, యూట్యూబ్‌, గూగుల్ వంటి సామాజిక మాధ్య‌మాల ద్వారా దీని గురించి అవ‌గాహ‌న పెంచుకోవ‌చ్చు. ప్ర‌పంచంలో ఎక్క‌డో ఏదో జ‌రిగితే అది మార్కెట్ల‌పై ప్ర‌భావం చూపుతుంది. అది ఎందుకు, కార‌ణాలేంటి అన్న విషయాలు తెలిస్తే మ‌దుప‌ర్ల‌కు అవ‌గాహ‌న పెరిగి పెట్టుబ‌డులు చేయ‌డంలో నేర్పు ల‌భిస్తుంది.

ఎలా అనువ‌దించుకోవాలి?

పెట్టుబ‌డుల్లో మ్యూచువ‌ల్ ఫండ్లు, ఈక్విటీలు, బీమా పాల‌సీలు, బాండ్లు వంటి ప‌లుర‌కాలు ఉంటాయి. వీటిని సెబీ లేదా ఐఆర్‌డీఏఐ నిర్వ‌హిస్తుంది. అయితే అందులో మీకు ఏది స‌రిపోతుందో, ఏది స‌రైన‌దో, ఏం ల‌క్ష్యాంగా పెట్టుబ‌డులు ప్రారంభించాల‌నుకుంటున్నారో చూసి ఎంచుకోవాలి.

  • బీమా అంటే సంప‌ద‌న‌ను సృష్టించుకునేందుకు కాదు. ఆర్థిక భ‌ద్ర‌త కోసం అన్న విష‌యం గుర్తుంచుకోవాలి.
  • మంచి ప‌నితీరు క‌న‌బ‌రుస్త‌న్న‌ కంపెనీ షేర్లు త‌క్కువ ధ‌ర ఉన్న‌ప్పుడు కొనుగోలు చేయాలి.
  • మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో న్యూ ఫండ్ ఆఫ‌ర్ లేదా క్లోజ్ ఎండెడ్ ఫండ్ల‌లో పెట్ట‌డం మంచిది.

పెట్టుబ‌డి చేసేముందు ఆ స్టాక్ గ‌తంలో ప‌నితీరు ఎలా ఉంది. భ‌విష్య‌త్తులో ఎలా ఉండ‌బోతుంద‌న్న‌ది అంచ‌నా వేసి లేదా నిపుణుల స‌ల‌హా తీసుకొని పెట్టుబ‌డి చేయాలి. అయితే మీరు ఆశించినంత లాభాలు అనుకున్న స‌మ‌యానికి రాలేద‌ని నిరాశ‌ చెందడం కూడా మంచిది కాదు. దీర్ఘ‌కాలం పెట్టుబ‌డులు కొన‌సాగిస్తే క‌చ్చిత‌మైన రాబ‌డి వ‌స్తుంది.

చివ‌రిగా చెప్పేదేంటంటే, పెట్టుబ‌డులు ప్రారంభించే ముందు ఆర్థిక నిపుణుల గురించి సూచ‌న‌లు తీసుకోవాలి లేదా మీరు సొంతంగా పెట్టుబ‌డులు ప్రారంభించానుకుంటే దాని మీద‌ క‌నీస అవ‌గాహ‌న ఏర్ప‌రుచ‌కోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని