Fixed Deposits: ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్లు పెంచిన మ‌రో స్మాల్ ఫినాన్స్ బ్యాంక్‌

ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది

Updated : 28 May 2022 15:45 IST

రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవల రెపోరేటును 40 బేసిస్‌ పాయింట్లు పెంచి 4.40 శాతంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆర్‌బీఐ ఈ నిర్ణ‌యం త‌ర్వాత ఎస్‌బీఐతో పాటు బంధన్‌ బ్యాంక్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, బ్యాంక్ ఆఫ్‌ బరోడా, ఐసీఐసీఐ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ వంటి ప‌లు వాణిజ్య బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ రేట్లను పెంచాయి. ఇప్పుడు స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు కూడా ఇదే బాట‌లో న‌డుస్తున్నాయి. జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉజ్జీవ‌న్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఇప్ప‌టికే వ‌డ్డీ రేట్లు పెంచ‌గా తాజాగా ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది. 

వివిధ కాల‌ప‌రిమితులు గ‌ల‌ రూ. 2 కోట్ల లోపు డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. ఈ పెంచిన వ‌డ్డీ రేట్లు మే 24, 2022 నుంచి అమ‌లవుతాయ‌ని బ్యాంకు తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. సీనియ‌ర్ సిటిజ‌న్లకు సాధార‌ణ ప్ర‌జ‌ల కంటే 0.50 శాతం అద‌న‌పు వ‌డ్డీ ల‌భిస్తుంది. 

46 నుంచి 90 రోజుల కాల‌ప‌రిమితి గ‌ల డిపాజిట్ల‌పై వ‌డ్డీ రేటును 3.25 శాతం నుంచి 3.50 శాతానికి పెంచింది. అలాగే 91 రోజుల 180 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 3.50 శాతం నుంచి 4 శాతానికి, 181 నుంచి 364 రోజుల గ‌ల డిపాజిట్ల‌పై 5.15 శాతం నుంచి 5.40 శాతానికి, 12 నుంచి 18 నెల‌ల డిపాజిట్ల‌పై 6 శాతం నుంచి 6.25 శాతానికి, 36 నెల‌ల పైనా 42 నెల‌ల‌లోపు డిపాజిట్ల‌పై 6.75 శాతం నుంచి 7 శాతానికి, 59 నెల‌ల పైనా 66 నెల‌ల‌లోపు డిపాజిట్ల‌పై 6.75 శాతం నుంచి 7 శాతానికి, 66 నెల‌ల‌పైనా 84 నెల‌లోపు డిపాజిట్ల‌పై 5.50 శాతం నుంచి 6 శాతానికి వ‌డ్డీ రేట్ల‌ను పెంచింది. 

వివిధ కాల‌ప‌రిమితులు గ‌ల డిపాజిట్ల‌పై ఫిన్‌కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తాజా వ‌డ్డీ రేట్లు..
7  రోజుల‌ నుంచి 45 రోజులు ... 3%
46 రోజుల‌ నుంచి 90 రోజులు ... 3.5%
91 రోజుల‌ నుంచి 180 రోజులు ... 4%
181 రోజుల నుంచి 364 రోజులు ... 5.4%
12 నెల‌ల నుంచి 15 నెల‌లు ... 6.25%
15 నెల‌ల 1 రోజు నుంచి 18 నెల‌లు ... 6.25%
18 నెల‌ల 1 రోజు నుంచి 21 నెల‌లు ...  6.50%
21 నెల‌ల 1 రోజు నుంచి 24 నెల‌లు ... 6.50%
24 నెల‌ల 1 రోజు నుంచి 30 నెల‌లు ... 6.50%
30 నెల‌ల 1 రోజు నుంచి 36 నెల‌లు ... 6.50%
36 నెల‌ల 1 రోజు నుంచి 42 నెల‌లు ... 7%
42 నెల‌ల 1 రోజు నుంచి 48 నెల‌లు ... 6.75%
48 నెల‌ల 1 రోజు నుంచి 59 నెల‌లు ... 6.75%
59 నెల‌ల 1 రోజు నుంచి 66 నెల‌లు ... 7%
66 నెల‌ల 1 రోజు నుంచి 84 నెల‌లు ... 6%

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని