విదేశాలకు సర్వీసులు నడిపే విమాన సంస్థలకు ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపు

విదేశాలకు విమాన సర్వీసులు నడిపే దేశీయ విమాన సంస్థలకు కేంద్రం ఊరటనిచ్చింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నుంచి ఏటీఎఫ్‌ కొనుగోళ్లపై ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చింది.

Published : 08 Jul 2022 17:35 IST

దిల్లీ: విదేశాలకు విమాన సర్వీసులు నడిపే దేశీయ విమాన సంస్థలకు కేంద్రం ఊరటనిచ్చింది. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీల నుంచి ఏటీఎఫ్‌ కొనుగోళ్లపై ఎక్సైజ్‌ సుంకం నుంచి మినహాయింపు ఇచ్చింది. వీటికి 11 శాతం ప్రాథమిక ఎక్సైజ్‌ సుంకం వర్తించబోదని స్పష్టంచేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ శుక్రవారం ఓ నోటిఫికేషన్‌ వెలువరించింది. జులై 1 నుంచే ఇది వర్తిస్తుందని పేర్కొంది.

ఇటీవల ఇంధన ఎగుమతులపై కేంద్రం పన్ను విధించిన సంగతి తెలిసిందే. ఎగుమతి చేసే పెట్రోల్‌, ఏటీఎఫ్‌కు లీటర్‌కు రూ.6 పన్ను వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. డీజిల్‌కు లీటర్‌కు రూ.13 సుంకం చొప్పున సుంకం వేశారు. ఈ ఉత్తర్వులు కాస్త గందరగోళానికి దారితీశాయి. విదేశాలకు సర్వీసులు నడిపే దేశీయ విమానయాన సంస్థలకూ ఎగుమతి పన్ను వర్తిస్తుందంటూ ఏటీఎఫ్‌ కొనుగోళ్లపై ఆయిల్‌ కంపెనీలు 11 శాతం ఎక్సైజ్‌ సుంకం విధించాయి. దీంతో ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. విదేశాలకు విమానాలు నడిపే సంస్థలకు ఎక్సైజ్‌ సుంకం వర్తించదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని