Binance: బైనాన్స్‌పై రూ.18.82 కోట్ల జరిమానా

ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ బైనాన్స్‌పై ది ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ్బఎఫ్‌ఐయ్శూ రూ.18.82 కోట్ల జరిమానా విధించింది. దేశ మనీ లాండరింగ్‌ చట్టాన్ని, బైనాన్స్‌ ఉల్లంఘించినట్లు ఆరోపణలే ఇందుకు నేపథ్యం.

Published : 21 Jun 2024 03:09 IST

దిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద క్రిప్టో ఎక్స్ఛేంజీ బైనాన్స్‌పై ది ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ ్బఎఫ్‌ఐయ్శూ రూ.18.82 కోట్ల జరిమానా విధించింది. దేశ మనీ లాండరింగ్‌ చట్టాన్ని, బైనాన్స్‌ ఉల్లంఘించినట్లు ఆరోపణలే ఇందుకు నేపథ్యం. వర్చువల్‌ డిజిటల్‌ అసెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఉన్న బైనాన్స్, అనుమానాస్పద లావాదేవీల నివేదికలను ఎఫ్‌ఐయూకు సమర్పించాల్సి ఉంటుంది. వీటితో ఆర్థిక మోసాలను ఎఫ్‌ఐయూ అదుపులో ఉంచుతుంది. ఈ నిబంధనలను బైనాన్స్‌ పాటించకపోవడం వల్లే ఈ జరిమానా విధించడానికి కారణంగా తెలుస్తోంది. 2023 డిసెంబరు 28న బైనాన్స్‌కు మొదటిసారి నోటీసు జారీ చేశారు. అంతకు ముందు రిపోర్టింగ్‌ సంస్థగా నమోదుకాని బైనాన్స్, ఈ ఏడాది మేలో నమోదైంది.  బైనాన్స్‌ వివరణ తర్వాత, జరిమానా విధించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు

.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని