అంద‌రికీ అవ‌స‌ర‌మ‌మ్యే ఐదు బీమా పాల‌సీలు

భ‌విష్య‌త్తులో ఎటువంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో ముందుగా ఊహించ‌లేం కాబ‌ట్టి విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు గృహ బీమా ప‌థ‌కాన్ని తీసుకోవ‌డం మంచిది.

Published : 27 Dec 2020 20:10 IST

అనుకోని ప్ర‌మాదాల వ‌ల్ల క‌లిగే న‌ష్టాల నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు బీమా ర‌క్ష‌ణ గా ఉంటుంది. వివిధ ర‌కాల బీమా పాల‌సీలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్య ర‌క్ష‌ణ‌కు ఆరోగ్య బీమా , గృహ‌ ర‌క్ష‌ణ‌కు గృహ బీమా మ‌న‌పై ఆధార‌డ‌డిన కుటుంబ‌స‌భ్యుల కోసం ట‌ర్మ్ బీమా, ప్ర‌మాద‌బీమా వంటి వి అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు సైబ‌ర్ బీమా కూడా అందుబాటులో ఉంది.

ఆరోగ్య బీమా:

ఆసుప‌త్రి వైద్య ఖ‌ర్చులు ఏటా 15-20 శాతం చొప్పున పెరుగుతున్నాయి. ఆరోగ్య బీమా కు సంబంధించి బేస్ పాల‌సీ ఒక‌టి తీసుకోవాలి. హామీ మొత్తం పెంచుకునేందుకు టాప్ అప్ పాల‌సీని అద‌నంగా తీసుకోవ‌డం మంచిది. త‌ద్వారా అధిక క‌వ‌రేజీ ల‌భిస్తుంది. క్రిటిక‌ల్ ఇల్‌నెస్ క‌వ‌రేజీ కూడా అద‌నంగా తీసుకోవ‌చ్చు. కొద్దిపాటి అద‌న‌పు ప్రీమియం చెల్లించ‌డం ద్వారా ఈ స‌దుపాయం పొంద‌వ‌చ్చు.

ట‌ర్మ్ బీమా:

త‌మ‌పై ఆధార‌ప‌డి ఉండే కుటుంబ స‌భ్యుల కోసం ట‌ర్మ్ బీమా త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. త‌మ వార్షిక ఆదాయానికి క‌నీసం 15 రెట్లు బీమా హామీ మొత్తం ఉండేలా ట‌ర్మ్ పాల‌సీని తీసుకోవాలి. దీనికి ప్రీమియం కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదురైతే ఈ హామీ మొత్తం కుటుంబ స‌భ్యుల‌కు అందుతుంది.

గృహ బీమా:

చాలా మంది సొంతింటిని నిర్మాణం లేదా కొనుగోలు చేయడం ద్వారా ఆర్థిక‌ప‌రంగా సుస్థిర‌త‌ను పొందుతారు. భ‌విష్య‌త్తులో ఎటువంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో ముందుగా ఊహించ‌లేం కాబ‌ట్టి విప‌త్తుల‌ను ఎదుర్కొనేందుకు గృహ బీమా ప‌థ‌కాన్ని తీసుకోవ‌డం మంచిది. స‌హ‌జ‌సిద్ధంగా, మాన‌వ చ‌ర్య‌ల వ‌ల్ల ఏర్ప‌డే సంఘ‌ట‌న‌ల‌ను క‌వ‌రే చేసే గృహ బీమా పాల‌సీ తీసుకోవ‌డం ద్వారా సొంతింటికి భ‌ద్ర‌త క‌లిగించ‌వ‌చ్చు. దీంతోపాటు ఇంట్లో ఉండే సామానులు కూడా ముఖ్య‌మే కాబ‌ట్టి వాటికి సంబంధించి కంటెంట్ క‌వ‌ర్ బీమా ను కూడా తీసుకోవాలి. దీని ద్వారా ఇంట్లో ఉండే విలువైన సామాగ్రికి కూడా బీమా స‌దుపాయం వ‌ర్తిస్తుంది.

వ్య‌క్తిగ‌త ప్ర‌మాద బీమా :

ఇంట్లో నుంచి బ‌య‌టికి వ‌స్తే ఊహించలేని పరిస్థితులతో నిండిన ప్రపంచం.వాహ‌నాల సంఖ్య‌పెరిగిపోతుంది. మ‌నం స‌వ్యంగా వ‌చ్చిన ఇత‌రుల పొర‌పాట్ల వ‌ల్ల ప్ర‌మాదాలు జ‌రిగేందుకు ఆస్కారం ఉంటుంది.చిన్న వాటికి ఏం కాదు కానీ పెద్ద ప్ర‌మాదాలు జ‌రిగితే అంగవైకల్యం లాంటివాటికి గురికావొచ్చు. ఆ సంద‌ర్భాల్లో మ‌న‌పై ఆధార‌ప‌డి ఉండే కుటుంబ సభ్యులపై ప్ర‌భావం చూపుతుంది.

వ్య‌క్తిగత వ్యక్తిగత ప్రమాద బీమా పాల‌సీతో ఇటువంటి సంఘటనల నుంచి ర‌క్ష‌ణ‌పొందేందుకు వీలుంటుంది. స్థానిక, అంతర్జాతీయ రక్షణ ను ఈ పాల‌సీలు క‌ల్పిస్తాయి. ప్రమాదవశాత్తూ మరణం, శాశ్వత లేదా పాక్షిక వైకల్యం వంటివి క‌వ‌ర్ అయ్యేలా పాల‌సీ తీసుకోవాలి. దీని ద్వారా ఆసుప‌త్రి ఖ‌ర్చులు పాల‌సీదారుడు పొంద‌వ‌చ్చు. జనవరి 1 నుంచి, రెండు లేదా అంతకంటే ఎక్కువ కార్లు క‌లిగిన వ్యక్తి ఒక నిర్బంధ వ్యక్తిగత ప్రమాద పాల‌సీ కొనొచ్చు. పాలసీదారుడిచే నడిపేఅన్ని వాహనాలకు రక్షణ పొందవచ్చు.

సైబ‌ర్ బీమా:

ప్ర‌స్తుతం చాలా మంది ఆన్లైన్ లో ఎక్కువ‌సేపు ఉంటున్నారు. చాలా వ‌ర‌కూ వారి స‌మ‌చారం కంప్యూట‌ర్, మొబైల్ వంటి ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాల ద్వారానే యాక్సెస్ చేస్తున్నారు. బ్యాంకింగ్ , కొనుగోల్లు వంటివి ఇంట‌ర్నెట్ ద్వారా చేస్త‌న్న‌పుడు వారి స‌మ‌చారం అప‌హ‌ర‌ణ‌కు గురయ్యే అవ‌కాశం ఉంటుంది. కాబ‌ట్టి ఇలాంటి సైబ‌ర్ దాడుల ద్వారా జ‌రిగే న‌ష్టాన్ని భ‌ర్తీ చేసుకోవ‌డానికి ఈ సైబ‌ర్ బీమా ఉపయోగ‌ప‌డుతుంది.

సిరి లో ఇంకా:

మ‌దుప‌ర్ల ప్ర‌శ్న‌ల‌కు సిరి జవాబులు , వ‌డ్డీ లెక్కేసేందుకు సిరి క్యాలుక్యులేట‌ర్ చక్ర వడ్డీ , ఏ అంశాన్నైనా సులభంగా అర్థ‌మ‌య్యేలా చేసే ఇన్ఫోగ్రాఫిక్స్, వివిధ ర‌కాల మ్యూచువ‌ల్ ఫండ్ల ప‌నితీరు ఎలా ఉందో తెలిపే ఫండ్ల వివ‌రాలు. ఫాలో అవ్వాలంటే ఈనాడు సిరి ఫేస్ బుక్ , ఈనాడు సిరి ట్విట్ట‌ర్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని