దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని అందించే ప‌థ‌కాలు

దీర్ఘ‌కాలంలో మంచి సంప‌ద‌ను సృష్టించాలంటే పెట్టుబ‌డి చేయాల్సిన ఐదు సాధ‌నాల గురించి తెలుసుకుందాం.......

Published : 21 Dec 2020 13:10 IST

దీర్ఘ‌కాలంలో మంచి సంప‌ద‌ను సృష్టించాలంటే పెట్టుబ‌డి చేయాల్సిన ఐదు సాధ‌నాల గురించి తెలుసుకుందాం.​​​​​​​

8 అక్టోబర్ 2018 మధ్యాహ్నం 11:13

మ‌దుప‌ర్లు చాలా వ‌ర‌కూ త‌మ పెట్టుబ‌డిపై ఎక్కువ శాతం రాబ‌డి పొందాల‌నే ఉద్దేశంతోనే పెట్టుబ‌డులు చేస్తుంటారు. కొంత కాలం పాటు పెట్టుబ‌డి చేసుకుంటూ వెళ్తే సంప‌ద‌ను సృష్టించ‌డం క‌ష్ట‌మేమీ కాదు. మంచి స‌మ‌యంలో చేసే పెట్టుబ‌డులు కొంత కాలానికి వృద్ధి చెంది మంచి సంప‌ద‌గా మారుతాయి

డైరెక్ట్ మ్యూచువ‌ల్ ఫండ్లు:

మ్యూచువ‌ల్ ఫండ్ సంస్థ‌లన్నీ త‌ప్ప‌కుండా డైరెక్ట్ ప్లాన్ లు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉంచాల‌నే నిబంధ‌న ఉంది. డైరెక్ట్ ప్లాన్ లో మ‌దుపు చేయ‌డం ద్వారా మ‌దుప‌ర్ల‌కు డిస్ట్రిబ్యూట‌ర్ ఛార్జీలు,క‌మీష‌న్ త‌గ్గి మొత్తంగా ఎక్స్‌పెన్స్ రేషియో త‌గ్గుతుంది. డైరెక్టు ప్లాన్ లో మ‌దుపు చేయ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో మంచి ప్ర‌యోజ‌నం చేకూరుతుంది. రెగ్యుల‌ర్ ప్లాన్ కంటే కూడా 1-1.5 శాతం త‌క్కువ నిర్వ‌హ‌ణ రుసుం ఉంటుంది.

ఒక శాతం తో దీర్ఘకాలంలో మార్పు ఎక్కువ‌గా ఉంటుంది. ఉదాహరణకు31 ఏళ్ల వ్య‌క్తి సిప్ విధానంలో నెల‌కు రూ.10,000 పెట్టుబ‌డి చేస్తే 8 శాతం రాబ‌డి అంచ‌నా చొప్పున 25 ఏళ్ల‌కు రెగ్యుల‌ర్ ప్లాన్ లో మొత్తం రూ.78.75 ల‌క్ష‌లు ఆర్జిస్తే డైరెక్ట్ ప్లాన్ లో రూ.91.5 ల‌క్ష‌లు ఆర్జించ‌వ‌చ్చు. నెల‌కు రూ.20,000 సిప్ చేస్తే 25 ఏళ్ల త‌రువాత రూ.1.57 కోట్లు, డెరెక్టు ప్లాన్ లో అయితే రూ. 1.83 కోట్లు పొంద‌వ‌చ్చు.

ఎంప్లాయి స్టాక్ ఆప్ష‌న్లు:

చాలా మంది ఉద్యోగులు ఈసాప్ ల‌ను సంప‌ద సృష్టికి ప్ర‌ధాన‌మైందిగా భావించ‌క‌పోవ‌చ్చు. కానీ ఈసాప్ లు దీర్ఘ‌కాలంలో పెద్ద మొత్తాన్ని అందిస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు. ఈసాప్ ల ద్వారా ఉద్యోగులు ధ‌న‌వంతులు కావ‌డం మ‌నం చూడొచ్చు. బంధ‌న్ బ్యాంకు ఐపీఓ విజ‌య‌వంత‌మైన త‌రువాత చాలా మంది ఉద్యోగులు ధ‌న‌వంతులయ్యారు. ఇటీవ‌లె హెచ్‌డీఎఫ్‌సీ ఏఎఎమ్‌సీ ఐపీఓ, ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ డీల్ త‌రువాత ఉద్యోగులు ఎంప్లాయిమెంట్ స్టాక్ ఆప్ష‌న్ల‌తో ధ‌న‌వంతుల‌య్యారు.

కాబ‌ట్టి మీరు ప‌నిచేసే చోట ఈసాప్ లు ఇస్తే వాటిని జాగ్ర‌త్త‌గా ఉంచుకోండి

వృద్ధి చెందే యాన్యూటీలు:

ఫిక్సిడ్ డిపాజిట్ల‌లా 5-6 శాతం రాబ‌డి, ఆదాయం పన్ను చెల్లించాల్సి ఉండ‌టం వ‌ల్ల చాలా మంది మ‌దుప‌ర్లు యాన్యూటీల‌పై ఆస‌క్తి చూపించ‌రు. కానీ ప్రతి సంవత్సరం స్థిరమైన‌ పెంపుతో రాబ‌డి అందించే యాన్యువిటీలు ఉన్నాయి. యాన్యుటీలలో కొన్నింటిని జీవితకాలం ప్రతీ సంవత్సరం 5% వృద్ధి చొప్పున చెల్లింపులు పెంచుతాయి. పాల‌సీదారులు ప్ర‌తీ సంవత్సరానికి 5% ఎక్కువ ఆదాయం పొందుతారు. వృద్ధి చెందుతున్న‌ యాన్యుటీల్లో చెల్లింపులు సాధార‌ణ‌ యాన్యుటీ కంటే తక్కువగా ఉంటాయి.

ఉదాహరణకు, రూ .50 లక్షల వన్-టైమ్ యాన్యుటీ కొనుగోలు చేస్తే పాల‌సీదారుడు ఏటా రూ. 3.4 లక్షలు (అన్ని సంవత్సరాల‌కు స్థిరంగా ఉండేది) ఇస్తే, వృద్ధి చెందే యాన్యూటీలు వార్షికంగా రూ. 2.02 లక్షలు (మొద‌టి ఏడాది) చెల్లిస్తుంది. అయితే ప్ర‌తీ ఏటా 5 శాతం పెరుగుతుంది. 5% పెరుగుతున్న యాన్యుటీ స్థిర‌మైన యాన్యూటీతో పోల్చితే ఎక్కువ మొత్తంలో డబ్బును చెల్లిస్తుంది. 30 ఏళ్ళ వ్యక్తి మ‌రో 20 ఏళ్ల తర్వాత వ‌య‌సు 50 కి చేరుతుంది. ఆయ‌న మరో 25 ఏళ్లు (వయస్సు75) స్థిర వార్షికంగా సంవత్సరానికి 3.4 లక్షల రూపాయలు చెల్లిస్తుంది. అయితే వృద్ధి చెందే యాన్యూటీ 5 శాతం పెరుగుదలతో వార్షిక చెల్లింపు సంవత్సరానికి 18.16 లక్షల రూపాయలు చెల్లిస్తుంది.

మీరు ఎన్పీఎస్ లో మదుపు చేయగలిగితే, మంచి రాబడి తో యాన్యుటీ కూడా పొందొచ్చు.

బంగారు బాండ్లు:

సార్వ‌భౌమ బంగారు బాండ్లలో పెట్టుబ‌డి మంచి ఎంపిక అని చెప్ప‌వ‌చ్చు. ఎందుకంటే ఇందులో బంగారంతో భ‌ద్ర‌త‌, వ‌డ్డీ ఆదాయంతో ఫిక్సిడ్ డిపాజిట్లు రెండింటింలో క‌లిగే ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు. వీటిలో ఏటా 2.5శాతం వ‌డ్డీ ఆదాయం కూడా వ‌స్తుంది. వీటితో నేరుగా బంగారం కొనుగోలు చేయ‌న‌ప్ప‌టికీ బంగారం కొనుగోలు చేసేందుకు కావ‌ల్సిన డ‌బ్బును మ‌దుప‌ర్లు పొంద‌వ‌చ్చు. ఈ విధానంలో కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసే బంగారుబాండ్లను కొనుగోలు చేయ‌వ‌చ్చు. మెచ్యూరిటీ ముగిసిన త‌రువాత బాండ్ల ద్వారా వ‌చ్చే మొత్తం మార్కెట్లో ఆ స‌మ‌యంలో ఉన్న ధ‌ర‌కు స‌మానంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ మొత్తంతో మార్కెట్లో బంగారం కొనుగోలు చేయ‌వ‌చ్చు. సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాలు ఈ బాండ్ల కాల‌ప‌రిమితి 8 ఏళ్లు ఉంటుంది. కాబ‌ట్టి ఈ మ‌ధ్య‌లో బంగారం విలువ పెరిగితే మూల‌ధ‌న లాభం కూడా పొంద‌వ‌చ్చు.

ఫోక‌స్డ్ పోర్టుఫోలియో:

మంచి కంపెనీల్లో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా దీర్ఘ‌కాలంలో మంచి రాబ‌డిని పొంద‌వ‌చ్చు.10-15 షేర్ల‌ను ఎంచుకుని మ‌దుపు చేయ‌డం ద్వారా మంచి రాబ‌డి పొందొచ్చు. 40-50 కంపెనీల‌కు చెందిన షేర్ల‌లో మ‌దుపు చేయ‌డం ద్వారా పెట్టుబ‌డుల‌కు వైవిధ్య‌త ఎక్కువ‌గా అయి కొంత త‌క్కువ రాబ‌డి వ‌చ్చే వీలుంటుంది. ఒక్కో కంపెనీలో సుమారు 5-10 శాతం పెట్టుబ‌డి చేసేందుకు ఫోక‌స్డ్ పోర్టుఫోలియోతో వీల‌వుతుంది. అదే 40-50 కంపెనీల్లో అదే పెట్టుబ‌డి చేస్తే ఒక్కో కంపెనీలో 1-2 శాతం అవుతుంది. వైవిధ్య‌త అవ‌స‌రం ఉన్న దాని కంటే ఎక్కువ అవుతుంది. దీని ద్వారా రాబ‌డి త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. అయితే షేర్ల ఎంపిక‌లో జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. దీనికి సంబంధించి నిపుణుల స‌ల‌హాలు తీసుకోవ‌డం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని