Investments: ఫిక్స్‌డ్ డిపాజిట్ vs ఈక్విటీ మార్కెట్
బ్యాంకు ఎఫ్‌డీలు, ఈక్విటీ మార్కెట్ దేనికదే ప్రత్యేకం. మనకుండే ఆర్థిక పరిస్థితులు, అనుభవాన్ని బట్టి ఎలాంటి ఆర్తిక నిర్ణయాలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
తగినంత ఆదాయాన్ని పొందడానికి చాలా మంది వివిధ పొదుపు సాధనాలను ఆశ్రయిస్తారు. డబ్బును మదుపు చేసేటప్పుడు దాన్ని తగినంత పెంచాలనే ఉద్దేశంతోనే ప్రయత్నిస్తుంటారు. మీరు సంపద, ఆర్థిక స్థిరత్వాన్ని నిర్మించాలనుకుంటే మీ పెట్టుబడులను తప్పక సరైన చోట ఇన్వెస్ట్ చేయాల్సిందే. మీ డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టకపోతే ద్రవ్యోల్బణం కారణంగా ఆ డబ్బు విలువను కోల్పోతారు. ఎఫ్‌డీలు, వివిధ మార్కెట్ సాధనాల్లో ఏది మంచిదో తెలుసుకుందాం.
ఫిక్స్‌డ్ డిపాజిట్లు
ఎఫ్‌డీ, సురక్షితమైన పెట్టుబడి మార్గం. ఎఫ్‌డీలు మార్కెట్ హెచ్చు తగ్గులకు ప్రభావం కావు. మీ డబ్బు స్థిరమైన రేటుతో వృద్ధి చెందుతుంది. ముందుగానే బ్యాంకు ప్రకటించిన రాబడి(వడ్డీ) లభిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎఫ్‌డీని మెచ్యూరిటీకి ముందే ఉపసంహరించుకోవచ్చు. కొన్ని ప్రముఖ బ్యాంకులు సంవత్సరానికి 7-8% రాబడిని ఇస్తుండగా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులయితే 8-9.50% వడ్డీ రేటును కూడా అందజేస్తున్నాయి. 2022 మే నెల నుండి ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడానికి ఆర్‌బీఐ రెపో రేట్లను పెంచుతూ వస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్ల పెంపునకు దారి తీసింది. దీంతో బ్యాంకు ఎఫ్‌డీల వడ్డీ రేట్లు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా తక్కువ కాలవ్యవధికి బ్యాంకు ఎఫ్‌డీల్లో పొదుపు లాభించే అవకాశముంది.
ఎఫ్‌డీ రాబడి
మీకు ఆర్థిక లక్ష్యాలు ఉన్నప్పుడు రాబడి చాలా ముఖ్యం. ద్రవ్యోల్బణ రేట్లు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటే బ్యాంకు ఎఫ్‌డీలపై రాబడి ఎలా ఉంటుందో చూద్దాం. మీరు సంవత్సరానికి 8% ఇచ్చే బ్యాంకు ఎఫ్‌డీలో పెట్టుబడి పెట్టారనుకుందాం. వడ్డీ ఆదాయంపై సంవత్సరానికి ఆదాయ పన్ను గరిష్ఠంగా 30%(అత్యధిక పన్ను పరిధిలోని వారు) విధిస్తే..5.80% పన్ను అనంతర వార్షిక రాబడి పొందుతారు. అయితే, సగటు ద్రవ్యోల్బణం 6.50% నుంచి 7% వరకు ఉంది. ఈ లెక్కన బ్యాంకు ఎఫ్‌డీపై రాబడి, సగటు ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా ఉంది. దీని వల్ల లక్ష్యం దెబ్బతింటుంది. అందువల్ల మదుపుదారులు తమ పోర్ట్‌ఫోలియోలో ద్రవ్యోల్బణాన్ని అధిగమించే రాబడిని పొందేలా చూసుకోవాలి. బ్యాంకు ఎఫ్‌డీలు మీరు చిన్న ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి సంపదను కాపాడతాయి, సంపదను సృష్టించలేవు.
ఈక్విటీ మార్కెట్
ఎఫ్‌డీలతో పోల్చి చూసినప్పుడు ఈక్విటీ మార్కెట్ అస్థిరంగా కన్పించినప్పటికీ కొన్ని ఆర్థిక ప్రయోజనాలు లేకపోలేదు. ప్రత్యక్షంగా షేర్ మార్కెట్‌లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కొనుగోలుకు యత్నం చేయాలి. ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడి పొందే అవకాశం ఉన్నప్పటికీ, లాభాలు మార్కెట్ శక్తులపై ఆధారపడి ఉంటాయి. అందుచేత ఒకేసారి పెద్ద మొత్తాలను కాకుండా దీర్ఘకాలానికి చిన్న మొత్తాలను సిప్ విధానం ద్వారా పెట్టుబడి పెట్టాలి. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. మార్కెట్‌లో ప్రవేశించడానికి ముందు సరైన అవగాహన పెంచుకోవాలి. మీకు షేర్ మార్కెట్ గురించి లోతైన అవగాహన ఉండి, రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ..చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం ద్వారా మార్కెట్ పరిస్థితులను అర్ధం చేసుకోవాలి. ఫండ్‌ను ఎంచుకునే సమయంలో రిటర్న్‌ల పైనే కాకుండా భద్రతపై కూడా దృష్టి పెట్టాలి. లార్జ్ క్యాప్ ఇండెక్స్ ఫండ్‌లలో పెట్టుబడి, భద్రతకు మేలని చెప్పొచ్చు. ఈక్విటీలో 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా దీర్ఘకాలం విధానాన్ని ఎంచుకోవాలి.
చివరిగా: తక్కువ కాలానికి స్వల్ప రాబడే అవసరమనుకుంటే బ్యాంకు ఎఫ్‌డీలు మేలు. మార్కెట్‌పై మంచి పట్టుండి రిస్క్ అయినా పర్వాలేదు అనుకుంటే దీర్ఘకాలానికి మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కొనుగోలుకు సిప్ విధానం మేలు. పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Botsa: 28 మంది ఇంకా ఫోన్‌కి అందుబాటులోకి రాలేదు: మంత్రి బొత్స
-
Sports News
AUS vs IND WTC Final: భారత్‌కు వీరు.. ఆసీస్‌కు వారు.. ఎవరిదయ్యేనో పైచేయి?
-
General News
kishan reddy: హెల్త్ టూరిజంలో టాప్ 10 దేశాల్లో భారత్: కిషన్‌రెడ్డి
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Sharwanand: మూడుముళ్లతో ఒక్కటైన శర్వానంద్-రక్షితా రెడ్డి
-
India News
Odisha Train Accident: రైలు ప్రమాదంపై సుప్రీం కోర్టులో పిల్..