Flipkart: ఫ్లిప్‌కార్ట్‌లో ఫాస్టాగ్‌, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సేవలు

Flipkart : ఫాస్టాగ్, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్‌ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్‌ సొల్యూషన్ల సంస్థ బిల్‌డెస్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ వెల్లడించింది.

Updated : 11 Jul 2024 10:18 IST

మరో 3 విభాగాలకు డిజిటల్‌ చెల్లింపుల సదుపాయం విస్తరణ

దిల్లీ: ఫాస్టాగ్, డీటీహెచ్‌ రీఛార్జ్‌ సహా ఐదు కొత్త విభాగాల్లో డిజిటల్‌ చెల్లింపు సేవల సదుపాయాన్ని అందించేందుకు పేమెంట్‌ సొల్యూషన్ల సంస్థ బిల్‌డెస్క్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart) వెల్లడించింది. ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, మొబైల్‌ పోస్ట్‌పెయిడ్‌ బిల్లుల విభాగాలకు ఈ సదుపాయాన్ని విస్తరించినట్లు తెలిపింది.

నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా అభివృద్ధి చేసిన భారత్‌ బిల్‌ పేమెంట్స్‌ సిస్టమ్‌కు ఈ కొత్త సేవలను అనుసంధానం చేసేందుకు బిల్‌డెస్క్‌తో ఒప్పందం ఫ్లిప్‌కార్ట్‌కు ఉపయోగపడనుంది. ప్రస్తుతమున్న విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, మొబైల్‌ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ సేవలకు ఈ కొత్త సేవలు అదనం. ‘వినియోగదారుల డిజిటల్‌ చెల్లింపుల ప్రయాణాన్ని సులభతరం చేయాలన్న ప్లిప్‌కార్ట్‌ ఉద్దేశానికి అనుగుణంగా మా సేవల్లో వైవిధ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) సూపర్‌కాయిన్స్, పేమెంట్స్‌ విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న గౌరవ్‌ అరోరా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని