Flipkart: ఫిన్‌టెక్‌ రంగంలో ఫ్లిప్‌కార్డ్‌ రీఎంట్రీ.. సూపర్‌.మనీ పేరుతో పేమెంట్‌ యాప్‌

Flipkart: ఫ్లిప్‌కార్ట్‌ సొంతంగా మరో పేమెంట్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది.

Published : 27 Jun 2024 00:13 IST

Flipkart | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ (flipkart) పేమెంట్‌ యాప్‌ను లాంచ్‌ చేసింది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) పేమెంట్స్‌ జరిపేందుకు సూపర్‌.మనీ (Super.money) పేరుతో ప్రత్యేక అప్లికేషన్‌ను తీసుకొచ్చింది. దీంతో ఫిన్‌టెక్‌ విభాగంలో తిరిగి రంగప్రవేశం చేసింది.

ఈ 35 ఫోన్ల మోడల్స్‌లో వాట్సప్‌ బంద్‌.. జాబితాలో మీ మొబైల్‌ ఉందా?

ఫ్లిప్‌కార్ట్‌ తీసుకొచ్చిన ఈ సూపర్‌ యాప్‌ యాప్‌ ప్లే స్టోర్‌లో బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది. ఇకపై దీని సాయంతో యూపీఐ లావాదేవీలు జరపొచ్చని కంపెనీ పేర్కొంది. యాప్‌ ద్వారా జరిపే పేమెంట్స్‌పై రియల్‌ క్యాష్‌బ్యాక్‌లు అందిస్తామని కంపెనీ పేర్కొంటోంది. త్వరలోనే యాప్‌ ద్వారా రుణాలు అందించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఫ్లిప్‌కార్ట్‌ నుంచి ఫోన్‌పే ఏడాది క్రితం వేరుపడింది. అప్పటి నుంచి ఈ రెండు సంస్థలు విడివిడిగా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. యూపీఐ చెల్లింపుల విభాగంలో ఫోన్‌పే 50 శాతం వాటాతో మార్కెట్‌ లీడర్‌గా కొనసాగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని