ఎఫ్‌ఎంపీల్లో మదుపు..

డెట్‌ ఆధారిత పథకాల్లో మదుపు చేయడం ద్వారా పెట్టుబడి వృద్ధికి తోడ్పడే వ్యూహంతో అందుబాటులోకి వచ్చిన పథకం హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎఫ్‌ఎంపీ ఏప్రిల్‌ 2019 (1). ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. ఇన్‌కం విభాగానికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకంలో ఏప్రిల్‌ 10 వరకూ మదుపు చేసేందుకు వీలుంది.

Updated : 08 Dec 2022 19:36 IST

డెట్‌ ఆధారిత పథకాల్లో మదుపు చేయడం ద్వారా పెట్టుబడి వృద్ధికి తోడ్పడే వ్యూహంతో అందుబాటులోకి వచ్చిన పథకం హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఎఫ్‌ఎంపీ ఏప్రిల్‌ 2019 (1). ఇందులో కనీస పెట్టుబడి రూ.5,000. ఇన్‌కం విభాగానికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకంలో ఏప్రిల్‌ 10 వరకూ మదుపు చేసేందుకు వీలుంది. పెట్టుబడిని కనీసం 1127 రోజులపాటు కొనసాగించాల్సి ఉంటుంది.

స్థిరాదాయ పథకాల్లో మదుపు చేసే వ్యూహంతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఫిక్స్‌డ్‌ మెచ్యూరిటీ ప్లాన్‌ సిరీస్‌ 85 వచ్చింది. ఇందులో పెట్టుబడిని 1114 రోజులపాటు ఉంచాలి. ఏప్రిల్‌ 9 వరకూ మదుపు చేసేందుకు వీలున్న ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.5వేలు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాండ్లతోపాటు, ఇతర డెట్‌ పథకాల్లో మదుపు చేయడం ద్వారా పెట్టుబడి వృద్ధికి తోడ్పడే పథకం రిలయన్స్‌ ఫిక్స్‌డ్‌ హారిజన్‌ ఫండ్‌- సిరీస్‌ 7. ఇది ఇన్‌కం విభాగానికి చెందిన క్లోజ్‌ ఎండెడ్‌ పథకం. కనీస పెట్టుబడి రూ. 5 వేలు. ఏప్రిల్‌ 17 వరకూ మదుపు చేసేందుకు అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని