IRCTC ఖాతాకు ఆధార్‌ లింక్‌ చేయలేదా? లేదంటే ఈ సదుపాయం కోల్పోయినట్లే..!

రైల్వే టికెటింగ్‌కు సంబంధించి ఇటీవల భారతీయ రైల్వే (Indian Railway) కీలక ప్రకటన చేసింది. ఐఆర్‌సీటీసీ (IRCTC)లో రైలు టికెట్లపై ఉన్న పరిమితిని పెంచింది.

Published : 25 Jun 2022 21:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రైల్వే టికెటింగ్‌కు సంబంధించి ఇటీవల భారతీయ రైల్వే (Indian Railway) కీలక ప్రకటన చేసింది. ఐఆర్‌సీటీసీ (IRCTC)లో రైలు టికెట్లపై ఉన్న పరిమితిని పెంచింది. ఆధార్‌ను అనుసంధానం చేసిన వారికి టికెట్ల జారీ పరిమితిని రెట్టింపు చేసింది. ఇంతకుముందు ఆధార్‌ను అనుసంధానం చేసిన వారికి నెలకు 12 టికెట్లను బుక్‌ చేసే వెసులుబాటు ఉండగా.. తాజాగా ఆ సంఖ్యను 24కు పెంచారు. అలాగే, ఆధార్‌ లింక్‌ చేయని వారికి 6 టికెట్లుగా ఉన్న పరిమితిని 12కి పెంచారు. ఒకవేళ మీరు ఇప్పటికే ఆధార్‌ లింక్‌ చేసి ఉంటే పర్లేదు. లేదంటే దిగువ పేర్కొన్న విధంగ సులువుగా మీ ఐఆర్‌సీటీసీ ఖాతాకు ఆధార్‌ను అనుసంధానం చేసుకోండి.

ఆధార్‌ అనుసంధానం ఇలా..

  • irctc.co.inలోకి వెళ్లి మీ ఖాతా వివరాలతో లాగిన్‌ అవ్వండి.
  • మై అకౌంట్‌ సెక్షన్‌లోకి వెళ్లి లింక్‌ ఆధార్‌పై క్లిక్‌ చేయండి.
  • అక్కడ మీ ఆధార్‌ నంబర్‌ లేదంటే వర్చువల్‌ ఐడీ వివరాలు ఇవ్వండి.
  • తర్వాత అక్కడ ఉన్న చెక్‌ బాక్స్‌ను టిక్‌ చేసి సెండ్‌ ఓటీపీపై క్లిక్‌ చేయండి.
  • ఆధార్‌ అనుసంధానం చేసి ఉన్న మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్‌ చేయండి.
  • వెరిఫైపై క్లిక్‌ చేసి మీ వివరాలు సరి చూసుకోండి. అన్నీ సరిపోలితే వెంటనే అప్‌డేట్‌పై క్లిక్‌ చేయండి. దీంతో ఆధార్‌ అనుసంధానం పూర్తవుతుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని