యూపీఐచెల్లింపులు జాగ్రత్తగా
జేబులో కరెన్సీ నోట్లు పెట్టుకొని తిరిగే రోజులు పోయాయి. ఒక్క రూపాయి చెల్లించాలన్నా మొబైల్ ఫోనుంటే చాలు.. అలా స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబరు నమోదు చేసి చిటికెలో చెల్లించేయొచ్చు.
జేబులో కరెన్సీ నోట్లు పెట్టుకొని తిరిగే రోజులు పోయాయి. ఒక్క రూపాయి చెల్లించాలన్నా మొబైల్ ఫోనుంటే చాలు.. అలా స్కాన్ చేసి లేదా మొబైల్ నెంబరు నమోదు చేసి చిటికెలో చెల్లించేయొచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) నగదు లావాదేవీలను పూర్తిగా డిజిటల్‌కు మార్చేసింది. ఇదే సమయంలో చెల్లింపులు చేసేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇబ్బందులు తప్పవు.
ఏదైనా కొనుగోలు చేసినప్పుడు క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు చేస్తుంటాం. ఇలా స్కాన్ చేసినప్పుడు ఒకసారి దుకాణదారుడిని అడిగి వివరాలు ధ్రువీకరించుకోవాలి. ఆ తర్వాతే నగదు బదిలీ చేయాలి.
* సామాజిక వేదికల్లో ఉమ్మడి స్నేహితులుగా మారిన మోసగాళ్లు.. తాము ఫలానా వ్యక్తి మిత్రులమంటూ పేర్కొంటూ.. అతని ఫోన్ నెంబరు ఉంటే ఇవ్వాలని అడుగుతున్నారు. తర్వాత ఆ నెంబరుకు ఫోన్ చేయడం లేదా చెల్లింపుల యాప్‌లో సందేశాలు పంపించి డబ్బును అడుగుతున్నారు. పొరపాటున వారి మాయలో పడి, మీరు స్పందించారా అంతే సంగతులు.
* సాధ్యమైనంత వరకూ మీ యూపీఐ పిన్‌ను ఆరు అంకెలు ఉండేలా చూసుకోండి. సులభంగా గుర్తుంటుందని చాలామంది నాలుగంకెల పిన్‌ను ఉపయోగిస్తుంటారు. దీన్ని మార్చుకోవడం మేలు. యాప్ ఓపెన్ చేసేందుకూ ప్రత్యేకంగా పిన్ లేదా వేలి ముద్రను ఏర్పాటు చేసుకోవాలి.
* మీకు డబ్బు పంపిస్తున్నాం.. ఈ కోడ్ స్కాన్ చేసి, పిన్ నమోదు చేయండి అని చెబుతూ సందేశాలు వస్తుంటాయి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీరు ఎవరికైనా డబ్బు పంపేటప్పుడు, లేదా కొనుగోలు చేసినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినప్పుడు మాత్రమే యూపీఐ పిన్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. చెల్లింపులు స్వీకరించడానికి పిన్ నమోదు అక్కర్లేదు.
* బ్యాంకులూ నేరుగా యూపీఐ చెల్లింపులకు అనుమతిస్తున్నాయి. కాబట్టి, చెల్లింపుల కోసం వీలైనంత వరకూ వీటిని వాడేందుకు ప్రయత్నించండి. థర్డ్ పార్టీ యాప్‌లు సాధ్యమైనంత వరకూ వినియోగించకండి. ఒకటి లేదా రెండు యూపీఐ యాప్‌లకు మించి మొబైల్‌లో ఉండకుండా చూసుకోండి.
* యూపీఐ లావాదేవీ పూర్తి చేసిన తర్వాత బ్యాంకు నుంచి వచ్చే సంక్షిప్త సందేశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.
* క్రెడిట్ కార్డులనూ యూపీఐకి జత చేసుకొని, చెల్లించే వెసులుబాటును బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఈ సౌకర్యం వినియోగించుకుంటున్న వారు చెల్లింపు కోసం పొదుపు ఖాతా, క్రెడిట్ కార్డు దేన్ని ఉపయోగిస్తున్నారో స్పష్టంగా తెలుసుకోవాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Cyber Crimes: ఇంటర్నెట్ బ్యాంకింగ్ వాడుతున్నారా? ఈ ‘5s’ ఫార్ములా మీ కోసమే!
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!
-
Politics News
Andhra News: మరోసారి నోరు జారిన ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి
-
General News
Bed Rotting: ఏమిటీ ‘బెడ్ రాటింగ్’.. ఎందుకంత ట్రెండ్ అవుతోంది..?
-
Movies News
Rana Naidu: ఎట్టకేలకు ‘రానానాయుడు’ సిరీస్‌పై స్పందించిన వెంకటేశ్