RBI Governor: ఆహార పదార్థాల ధరల వల్లే ద్రవ్యోల్బణం తగ్గడంలో జాప్యం

రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం నెమ్మదించడానికి ఆహార పదార్థాల ధరలే కారణమని, ఇటీవలి పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంతదాస్‌ అభిప్రాయపడినట్లు ఆ సమావేశ ముఖ్యాంశాలు వెల్లడించాయి.

Published : 22 Jun 2024 02:36 IST

ఆర్‌బీఐ గవర్నరు

ముంబయి: రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం నెమ్మదించడానికి ఆహార పదార్థాల ధరలే కారణమని, ఇటీవలి పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశంలో ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంతదాస్‌ అభిప్రాయపడినట్లు ఆ సమావేశ ముఖ్యాంశాలు వెల్లడించాయి. వరుసగా ఎనిమిదో ద్వైమాసిక సమీక్షలోనూ రెపో రేటును 6.5 శాతం వద్ద యథాతథంగా కొనసాగించేందుకు ఎంపీసీ సభ్యుల్లో నలుగురు అనుకూలంగా, ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. ‘వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం తగ్గుతున్నప్పటికీ.. అది నెమ్మదిగానే ఉంది. అందువల్ల ద్రవ్యోల్బణ నియంత్రణ లక్ష్యాన్ని అందుకోవడం ఆలస్యం కావొచ్చ’ని దాస్‌ పేర్కొన్నారు. ఆహార పదార్థాల ధరల్లో హెచ్చుతగ్గుల వల్లే, ద్రవ్యోల్బణం దిగిరావడం ఆలస్యం అవుతోందని దాస్‌ తెలిపారు. సరఫరా పరమైన అవరోధాలు ఆహార పదార్థాల ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపించడం కొనసాగుతూనే ఉందని అన్నారు. సాధారణ వర్షపాత అంచనాలు కార్యరూపం దాల్చితే, కొన్ని కీలక ఆహార పదార్థాల ధరలపై ఒత్తిడి తగ్గుతుందని చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని