iPhones: ఛార్జర్ లేకుండా ఐఫోన్.. యాపిల్‌కు రూ.164 కోట్ల జరిమానా
యాపిల్‌ను ఛార్జర్ సంబంధింత సమస్యలు వీడడం లేదు. ఇప్పటికే ఈయూ పార్లమెంటు యూఎస్‌బీ-సీ ఛార్జర్లను తప్పనిసరి చేసింది. తాజాగా ఛార్జర్ లేకుండా ఐఫోన్ విక్రయించినందుకు బ్రెజిల్‌లో ఓ కోర్టు రూ.164 కోట్ల జరిమానా విధించింది.
సావో పౌలో (బ్రెజిల్): యాపిల్ మొబైల్ కంపెనీకి బ్రెజిల్‌లో మరోసారి భారీ షాక్ తగిలింది. ఛార్జర్ లేకుండా మొబైల్‌ను విక్రయిస్తున్నందుకు అక్కడి సావో పౌలో సివిల్ కోర్టు.. కంపెనీకి దాదాపు ₹164 కోట్ల (20 మిలియన్ డాలర్లు) జరిమానా విధించింది. వినియోగదారులను తప్పుదోవ పట్టించే ఇలాంటి చర్యలు ‘మోసపూరిత ఆచరణ’ కిందకు వస్తాయని వ్యాఖ్యానించింది. ఇది బలవంతంగా వినియోగదారులు మరో వస్తువును కొనేలా చేయడం అవుతుందని తెలిపింది. ఈ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లేందుకు యాపిల్‌కు అవకాశం ఉంటుంది.
పర్యావరణ హితం పేరుతో ఐఫోన్ 12, 13 సిరీస్ మొబైల్స్‌కి పవర్ అడాప్టర్, హెడ్‌ఫోన్‌లు లేకుంగా కేవలం ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఇస్తున్నట్లు యాపిల్ 2020 అక్టోబర్‌లో ప్రకటించింది. ఫోన్‌కు ఛార్జర్, హెడ్ సెట్ ఇవ్వకపోవడం వల్ల కొనుగోలుదారులు నష్టపోతున్నారని బ్రెజిల్ న్యాయశాఖ ఇప్పటికే గత సెప్టెంబరులో యాపిల్‌కు రెండు మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. తాజాగా సావో పౌలో కోర్టు విధించింది దీనికి అదనం.
తాజా తీర్పులో జరిమానా విధించడంతో పాటు గత రెండు సంత్సరాల్లో ఐఫోన్ 12, 13 సిరీస్ మొబైళ్లు కొన్నవారందరికీ యాపిల్ కంపెనీ ఛార్జర్లు సరఫరా చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఛార్జర్ సంబంధిత సమస్యల్ని యాపిల్ చాలా దేశాల్లో ఎదుర్కొంటోంది. 2024 నుంచి స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, కెమెరాలన్నింటిలో యూఎస్‌బీ-సీ తరహా ఛార్జర్లనే అందించాలని గతవారం ఐరోపా సమాఖ్య పార్లమెంటు చట్టం చేసింది. దీంతో యాపిల్ తమ ఐఫోన్ డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
కులాంతర వివాహం చేసుకున్నారని మూగ దంపతుల గ్రామ బహిష్కరణ
-
విశాఖ స్టీల్‌ప్లాంటు ప్రైవేటీకరణ నిలిచిపోయింది: భాజపా ఎంపీ జీవీఎల్
-
గృహరుణం... తొందరగా తీర్చేద్దాం
-
నేపాలీ షెర్పా ప్రపంచ రికార్డు
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..