Ford India: ఫోర్డ్ మరో నిర్ణయం.. భారత్‌లో ఈవీల తయారీ ప్రణాళిక ఉపసంహరణ!
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ మోటార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల కోసం భారత్‌లో విద్యుత్ వాహనాల(ఈవీ)ను ఉత్పత్తి చేయాలనే తన ప్రణాళికలను విరమించుకుంది. ఫోర్డ్ ఇండియా యాజమాన్యం గురువారం చెన్నై ప్లాంట్‌లోని ఉద్యోగులకు ఈ విషయాన్ని తెలియజేసింది. వాహన, విడిభాగాల రంగానికి ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 2022లో ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహకాల(పీఎల్ఐ) పథకం కింద ఎంపికయిన సంస్థల్లో ఫోర్డ్ ఒకటి. అయితే, ఇకపై భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రానందున.. ఈ జాబితానుంచి వైదొలిగే అవకాశం ఉంది.
ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ‘పూర్తిస్థాయి సమీక్ష అనంతరం.. భారతీయ ప్లాంట్లలో విద్యుత్ వాహనాల ఉత్పత్తి చేపట్టకూడదని నిర్ణయించాం. ఇటీవల పీఎల్ఐ పథకం కింద మా ప్రతిపాదనను ఆమోదించినందుకు, మొదటినుంచి ఈ ప్రక్రియలో మద్దతుగా నిలిచినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు’ అని ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. భారత్‌లో కార్ల తయారీ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు 2021 సెప్టెంబరులో ఈ కంపెనీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా.. గుజరాత్‌లోని సనంద్, తమిళనాడులోని చెన్నై ప్లాంట్లలో ఒకదాన్ని ఈవీల తయారీ కేంద్రంగా మలిచేందుకు.. పీఎల్ఐ పథకానికి దరఖాస్తు చేసింది. తాజాగా.. ఈ ప్రణాళికలను ఉపసంహరించుకుంది.
అయితే, ఈ సంస్థ మొదట్లో అనుకున్నట్లుగా.. ఇక్కడి రెండు ప్లాంట్లను విక్రయించాలనే ప్రణాళికలను కొనసాగించే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఈ రెండు ప్లాంట్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సనంద్ ప్లాంట్ విక్రయం విషయంలో టాటా మోటార్స్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి. మరోవైపు.. చెన్నై ఫ్యాక్టరీ విషయంలో మరిన్ని అవకాశాల కోసం చూస్తోందని సంస్థ ప్రతినిధి తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Sushil Modi: ప్రధాని రేసులో నీతీశే కాదు.. మమత, కేసీఆర్ వంటి నేతలూ ఉన్నారు..!
-
World News
Ukraine Crisis: ఉక్రెయిన్‌లో సమాధుల తవ్వకాలు.. కారణమేంటంటే?
-
Politics News
Eknaht Shindhe: శిందే కేబినెట్లో ఫడణవీస్‌కే కీలక శాఖలు
-
Sports News
Cheteshwar Pujara : చితక్కొట్టిన పుజారా.. వరుసగా రెండో శతకం
-
Crime News
Crime News: బిహార్‌లో తెలంగాణ పోలీసులపై కాల్పులు
-
World News
UK PM Race: బ్రిటన్ ప్రధాని రేసులో.. ముందంజలో లిజ్ ట్రస్..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 14 - ఆగస్టు 20)
- Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా హఠాన్మరణం
- Hyderabad News: ఇంజినీరింగ్ విద్యార్థినికి భారీ ప్యాకేజీతో ఉద్యోగం
- RRR: ఆస్కార్‌లోనూ ‘ఆర్ఆర్ఆర్’ హవా కొనసాగుతుంది..
- Rakesh Jhunjhunwala: ఆయన జీవితమే ఓ ఆర్థిక మంత్రం..!
- Viral Video: క్షణం ఆలస్యమైనా పాము కాటేసేదే..! అంతలో ఏం జరిగిందంటే
- MK Stallin: ఆ నదిపై నిర్మాణాలొద్దు.. జగన్‌కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
- Bangladesh economic crisis: ఆర్థిక సంక్షోభం అంచున బంగ్లాదేశ్..!
- Vijay Deverakonda: డేటింగ్ లైఫ్.. ఆమెకు ఇలాంటివి నచ్చవు: విజయ్ దేవరకొండ
- Rakesh Jhunjhunwala: మరణం కూడా చిన్నబోయేలా..! వీల్‌ఛైర్‌లో ఝున్‌ఝున్‌వాలా డ్యాన్స్