Ford: మరో కంపెనీ చేతికి ఫోర్డ్‌ యూనిట్‌..!

భారత్‌లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్‌ మోటార్‌  ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి మరైమలైనగర్‌ ప్లాంట్‌ను వేరే కంపెనీకి

Updated : 13 Jan 2023 11:50 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌లో ఉత్పత్తి నిలిపివేస్తున్నట్లు ఫోర్డ్‌ మోటార్‌ ప్రకటించింది. అయితే, దీనికి సంబంధించి మరైమలైనగర్‌ ప్లాంట్‌ను వేరే కంపెనీకి అప్పజెప్పనున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆ ప్లాంటులో పనిచేసే ఉద్యోగులకు భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోంది. 

‘‘ఫోర్డ్‌ మరో కంపెనీ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీంతోపాటు మరికొన్ని కంపెనీలు కూడా ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాయి. వారు ఒక ఒప్పందానికి వస్తే భూమి సులభంగా చేతులు మారేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకొంటుంది’’ తమిళనాడు పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ మురగానందం పేర్కొన్నారు. గతేడాది కూడా ఓలా, మహీంద్రా అండ్‌ మహీంద్రాతో ఈ ఫ్యాక్టరీ విక్రయం లేదా లీజు అంశంపై ఫోర్డ్‌ చర్చలు జరిపింది.

చెన్నైలోని ఫోర్డ్‌ కర్మాగారం 350 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇక్కడ ఏటా 2 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతోపాటు 3.4లక్షల ఇంజిన్లు కూడా ఉత్పత్తి చేయవచ్చు. ఇక్కడే ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌, ఎండీవర్‌లను తయారు చేశారు. ఇక్కడ ఫోర్డ్‌దాదాపు బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఇక్కడి ఉత్పత్తులను 37 దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని