Foreign Reserves: దేశంలో తగ్గిన విదేశీ మారక నిల్వలు

భారత్‌ విదేశీ మారక నిల్వలు (Foreign Exchange Reserves) మూడు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి. అయితే, ఇది సహజమేనని రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతోంది.

Published : 17 Mar 2023 19:16 IST

దిల్లీ: భారత విదేశీ మారకద్రవ్య నిల్వలు (Foreign Exchange Reserves) మూడు నెలల కనిష్ఠానికి చేరుకున్నాయి. ఈ నెల 10న ముగిసిన వారాంతానికి 560 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి. గత డిసెంబరు నుంచి ఇంత కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. భారతీయ రిజర్వ్‌ బ్యాంకు శుక్రవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మార్చి 3న 562.40 బిలియన్‌ డాలర్లుగా ఉన్న విదేశీ మారక నిల్వలు 2.40 బిలియన్‌ డాలర్లు తగ్గి మార్చి 10 నాటికి 560 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి.

డాలరుతో రూపాయి మారకం విలువను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంకు కొన్ని చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల విదేశీ మారక నిల్వల్లో స్వల్పమార్పులు రావడం సహజమేనని రిజర్వ్‌ బ్యాంకు గతంలో పేర్కొంది. గత వారం అమెరికాలో సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌, సిగ్నేచర్‌ బ్యాంక్‌ సంక్షోభాలు బయపటడంతో డాలరుతో రూపాయి మారకం విలువ దాదాపు 0.1 శాతం పడిపోయింది. వారం రోజుల్లో  రూపాయి విలువ 81.615 నుంచి 82.297కి పెరిగింది. ఇవాళ డాలరుతో రూపాయి మారకం విలువ 82.63గా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని