India real estate: భారత స్థిరాస్తిలోకి రూ.25,700 కోట్ల విదేశీ పెట్టుబడులు

ఈ ఏడాది జనవరి- జూన్‌ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది.

Published : 07 Jul 2024 01:57 IST

దిల్లీ: ఈ ఏడాది జనవరి- జూన్‌ మధ్య భారత స్థిరాస్తి రంగంలో, విదేశీ పెట్టుబడిదారులు 3.1 బి.డాలర్ల (రూ.25,700 కోట్లు) పెట్టుబడులు పెట్టినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ జేఎల్‌ఎల్‌ ఇండియా వెల్లడించింది. మొత్తం సంస్థాగత పెట్టుబడుల్లో ఇవి 65 శాతానికి సమానం. జనవరి-జూన్‌లో స్థిరాస్తి రంగంలో మొత్తం సంస్థాగత పెట్టుబడులు 62% పెరిగి 4,760 మిలియన్‌ డాలర్లకు చేరాయి. ఏడాది క్రితం ఇదే సమయంలో ఇవి 2,939 మిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. 

నీ జేఎల్‌ఎల్‌ ఇండియా ప్రకారం.. స్థిరాస్తిలో సంస్థాగత పెట్టుబడులు 4.8 బి.డాలర్లకు పెరిగాయి. అంతర్జాతీయ అనిశిత్చులు, ఎన్నికల సీజన్‌ ఉన్నప్పటికీ.. భారత్‌పై పెట్టుబడిదార్ల విశ్వాసాన్ని ఇది సూచిస్తోంది. నీ మొత్తం పెట్టుబడుల్లో.. గోదాముల విభాగంలో 34 శాతం పెట్టుబడులు వచ్చాయి. గృహాల వాటా 33 శాతం, కార్యాలయాల వాటా 27 శాతంగా ఉంది.

నీ స్థిరాస్తి రంగంలో లావాదేవీల సంఖ్య దాదాపు రెట్టింపైంది. సగటు లావాదేవీ పరిమాణం 113 మిలియన్‌ డాలర్లుగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు