వ్యూహాత్మక పెట్టుబడులు.. ఆర్థిక జీవితానికి సోపానాలు
మన కుటుంభ సభ్యులకు మంచి జీవితాన్ని అందించాలంటే ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. పెట్టుబడులు ప్రారంభించేందుకు వయసుతో సంబంధం లేదు. జీవితంలో ఏ దశలో అయినా డబ్బు అవసరం ఉంటుంది....
జీవితాంతం ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడపాలంటే ఆర్థిక ప్రణాళిక చాలా ముఖ్యం
మన కుటుంభ సభ్యులకు మంచి జీవితాన్ని అందించాలంటే ఆర్థిక ప్రణాళిక చాలా అవసరం. పెట్టుబడులు ప్రారంభించేందుకు వయసుతో సంబంధం లేదు. జీవితంలో ఏ దశలో అయినా డబ్బు అవసరం ఉంటుంది. అందుకే ఇప్పటివరకు ఎలాంటి పొదుపు, పెట్టుబడులు ప్రారంబించకపోతే ఇప్పుడు ప్రారంభించండి.
దీర్ఘకాలిక ప్రణాళిక:
పెట్టుబడులు అనేవి జీవితంలో చాలా అవసరం . ఏ సమయంలో అయినా డబ్బు అవసరమే. అది ఎంత అన్నది సందర్భాన్ని బట్టి ఉంటుంది. మరి సమయానికి డబ్బు అందాలంటే పొదుపు చేయడం ప్రారంభించాలి. ఎంత త్వరగా ప్రారంభిస్తే అంత మంచి ఫలితాలు లభిస్తాయి. చాలా మంది జీవితంలో వారి కాలాన్ని, సామర్థ్యాన్ని డబ్బు సంపాదించేందుకే ఉపయోగిస్తారు . కానీ సంపాధించిన దాన్ని ఎలా ఆదా చేయాలి, సంపాధననను ఎలా రెట్టింపు చయాలి అనే దాని గురించి తెలుసుకోరు. దీని వలన ఎంత సంపాధించినా ఒక్కోసారి అవసరానికి డబ్బు చేతికందదు.
ఒక క్రమపద్ధతిలో పొదుపు చేయడం నేర్చుకోవడంతో పాటు, వ్యూహత్మక పెట్టుబడులు చేస్తే జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉంటాయి. మీరు తీసుకునే ఆర్థకి ప్రణాళిక మీ లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. అది మీ వయస్సు, సంపాదన, సమయం, రిస్క్‌పై ఆధారపడి ఉంటుంది. మీ ఆర్థిక లక్ష్యాలపై దృష్టి సారించి, ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిని బట్టి తెలివిగా పెట్టుబడులు చేయాలి.
లక్ష్యాల గురించి ప్రణాళిక చేసుకునేటప్పుడు మొదట ఎందుకోసం పెట్టుబడులు చేస్తున్నారు, ఎంతకాలం చేయాలనుకుంటున్నారని నిర్ణయించుకోవాలి. అంటే మీ లక్ష్యాలు కారు కొనుగోలు చేయడం, విదేశీ పర్యటనకు వెళ్లడం వంటి స్వల్పకాలం కొరకా లేదా పదవీ విరమణ ప్రణాళిక, పిల్లల ఉన్నత విద్య వంటి దీర్ఘకాలికమ అనేది నిర్ణయించుకోవాలి. ఒక సారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నాక దానికోసం ఎంత అవసరం అవుతుంది, ద్రవ్యోల్బణం కూడా కలిపి లెక్కించాలి. లక్ష్యాన్ని ఎంచుకొని పెట్టుబడులు ప్రారంభిస్తే సక్రమంగా ఉంటుంది.
మార్కెట్లో పెట్టుబడులుకు ఇప్పుడు చాలా మార్గాలు ఉన్నాయి. లెక్కలేనన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఒకేదాంట్లో మొత్తం పెట్టుబడులు పెట్టడం కంటే వివిధ మార్గాలను ఎంచుకోవడం మంచిది. కొంత ఈక్విటీ, డెట్, స్థిరాస్తి చొప్పున అన్నింటిలో కొంత మేర పెట్టుబడులు చేయాలి. పెట్టుబడి వ్యూహాలలో ఇది కూడా ఒకటి.
లక్ష్యం ఆధారంగా పెట్టుబడులు:
లక్ష్యం ఆధారంగా చేసే పెట్టుబడులు కచ్చితమైన క్రమమైన పెట్టుబడులకు దారితీస్తాయి. ఉదాహరణకు మీరు ఈక్విటీలో స్వల్ప కాలికంగా పెట్టుబడులు ప్రారంభిస్తే మార్కెట్లకు నష్టాలు వచ్చినప్పుడు కాస్త ఇబ్బంది కలగొచ్చు. అయితే దీర్ఘకాలికంగా పెట్టుబడులకు మాత్రం ఈక్విటీలు మంచి ఫలితాన్నిస్తాయనే చెప్పుకోవచ్చు. సిప్ ద్వారా పెట్టుబడులు పెడితే మంచిది. పెట్టుబడుల నిర్వహణకు చాలా మంది నిపుణులు ఉన్నారు. మంచి ఆర్థిక సలహాదారుని ఎంచుకొని, ఆర్థిక ప్రణాళికల గురించి తెలుసుకోవాలి. మీ లక్ష్యాలు మిమ్మల్ని క్రమమైన పెట్టుబడుల పెట్టేలా ఉపకరిస్తాయి. మరింకెందుకు ఆలస్యం ఈరోజే మీ లక్ష్యం ఎంచుకొని పెట్టుబడులవైపు అడుగేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?