మ్యూచువ‌ల్ ఫండ్ల ఎంపిక‌లో గుర్తుంచుకోవాల్సిన 4 విష‌యాలు

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు, న‌గ‌దు ల‌భ్య‌తల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.​​​​​​....

Published : 19 Dec 2020 13:10 IST

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు, న‌గ‌దు ల‌భ్య‌తల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.​​​​​​​

మ్యూచువ‌ల్ ఫండ్ల వ‌ర్గీక‌ర‌ణతో వివిధ ర‌కాల పేర్ల‌తో ఉండే మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఒకే ఫండ్ గా మార్చ‌డం జ‌రిగింది. అప్ప‌టివ‌ర‌కూ వంద‌ల్లో ఉన్న ఫండ్ల సంఖ్య‌ త‌గ్గింది. త‌ద్వారా మ‌దుప‌ర్ల‌కు మ్యూచువ‌ల్ ఫండ్లకు సంబంధించి స్ప‌ష్ట‌త ఉండి న‌ష్ట‌భ‌యం, రాబ‌డి త‌దిత‌ర అంశాలు అంచ‌నా వేసుకునేందుకు సుల‌భంగా ఉంటుంది.

పెట్టుబ‌డుల‌కు సంబంధించి వివిధ ర‌కాల సాధ‌నాలు మ‌దుప‌ర్ల‌కు అందుబాటులో ఉన్నాయి. మ‌దుప‌ర్లు త‌మ న‌ష్ట‌భ‌యం ఎంత‌నేది లెక్కించుక‌ని దానికి అనుకూలంగా ఉండే ఫండ్ల‌ను ఎంచుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మ్యూచువ‌ల్ ఫండ్ల‌నే తీసుకుందాం. మ‌దుప‌ర్లు త‌మ ఆర్థిక ల‌క్ష్యాల‌కు అనుగుణంగా వివిధ ర‌కాల ఫండ్ల‌ను ఎంచుకుంటారు. పెట్టుబ‌డులకు సంబంధించి పోర్టుఫోలియో నిర్మించుకునే ముందు మ‌దుప‌ర్లు త‌మ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉండే ఫండ్లను ఎంపిక చేసుకోవాలి. మ్యూచువ‌ల్ ఫండ్లలో న‌ష్ట‌భ‌యం ఎక్కువ ఉండేవి ఉంటాయి. వీటిలో రాబ‌డి కూడా ఎక్కువ‌గా వ‌చ్చేందుకు ఆస్కారం ఉంటుంది. న‌ష్ట‌భ‌యం త‌క్కువ ఉండే వాటిలో రాబ‌డి త‌క్కువ‌గా ఉంటుంది.

మ్యూచువ‌ల్ ఫండ్ల ఎంపిక‌లో గుర్తుంచుకోవాల్సిన 4 విష‌యాలు:

మ్యూచువ‌ల్ ఫండ్లను ఎంపిక చేసుకునేముందు మ‌దుప‌ర్లు న‌ష్ట‌భ‌యం, రాబ‌డితోపాటు ఆర్థిక ల‌క్ష్యం, వృద్ధి, ప‌న్ను మిన‌హాయింపులు ,న‌గ‌దు ల‌భ్య‌త ల‌ను దృష్టిలో ఉంచుకోవాలి.

ఈక్విటీ లో మ‌దుపు:

మ‌దుప‌ర్లు త‌మ పెట్టుబ‌డుల్లో కొంత శాతం ఈక్విటీ సంబంధిత పెట్టుబ‌డుల‌లో మ‌దుపుచేడం మంచిది. ఈక్విటీ పెట్టుబ‌డులు దీర్ఘ‌కాలంలో బాగా వృధ్ధి చెందుతాయి. ఈక్విటీ కేట‌గిరీలో వివిధ ర‌కాల ఫండ్లు అందుబాటులో ఉంటాయి. మార్కెట్ క్యాపిట‌లైజ‌స్త్రస‌న్ ఆధారంగా లార్జ్ , మిడ్ ,స్మాల్ , మ‌ల్టీ క్యాప్ ఫండ్లు ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్లు కొంత స్థిరంగా ఉంటాయి. ఇత‌ర ఈక్విటీ ఫండ్ల‌తో పోలిస్తే వీటిలో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా రాబ‌డికి స్థిర‌త్వం ఉంటుంది. ఈక్విటీలో దీర్ఘ‌కాలం పాటు మ‌దుపు చేసే వారు ఎక్కువ భాగం లార్జ్ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌డం మంచిది.

ఈక్విటీ పెట్టుబ‌డులకు సంబంధించి ఇండెక్స్ ఫండ్లు మంచి ఎంపిక‌ని చెప్ప‌వ‌చ్చు. మ‌దుప‌ర్లు కొంత శాతం ఇండెక్స్ ఫండ్ల‌లో మ‌దుపు చేయోచ్చు. వీటిలో త‌క్కువ నిర్వ‌హ‌ణ రుసుము ఉంటుంది. ఈ ఫండ్లు నిఫ్టీ సెన్సెక్స్ లాంటి మార్కెట్ ఇండెక్స్ ల‌తో పాటు వివిధ‌ రంగాల‌కు చెందిన ఇండెక్స్‌ల ఆధారంగా కూడా ఉంటాయి.

ప‌న్ను మిన‌హాయింపుల కోసం:

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ఈఎల్ఎస్ఎస్) ద్వారా ప‌న్ను మిన‌హాయింపులు పొందేందుకు వీటుంటుంది. సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను మిన‌హాయింపు ఉంటుంది. వీటికి మూడేళ్ల లాక్ఇన్ పిరియ‌డ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల్లో చేసే పెట్టుబ‌డికి వివిధ ర‌కాల మార్కెట్ క్యాప్ట‌లైజేష‌న్లు, రంగాల‌కు చెందిన పెట్టుబ‌డుల‌ను మ‌దుపు చేసేందుకు వీలుంటుంది.

రాబ‌డి ఎక్కువ రావాలంటే:

కొంత రిస్క్ ఉన్నా ఫ‌ర్వాలేదు రాబ‌డి రావాల‌ని ఆశించే వారు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు. మ్యూచువ‌ల్ ఫండ్ నిర్వాహ‌కులు మ‌ల్టీ క్యాప్ ఫండ్ల‌లో మొత్తం లార్జ్, మిడ్, స్మాల్ మూడుకేట‌గిరీల్లో ఉండే కంపెనీల్లో మ‌దుపుచేస్తారు. కాబ‌ట్టి వీటిలో న‌ష్ట‌భ‌యం కాస్త ఎక్కువ‌గానే ఉంటుంది. రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం కూడా ఎక్కువ‌గానే ఉంటుంది.

న‌గ‌దు అవ‌స‌రాల కోసం:

అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో డ‌బ్బు కావాల్సిన‌ప‌డు లేదా ఇంకేవైనా అవ‌స‌రాల‌కు డ‌బ్బు పొందేందుకు వీలుగా లిక్విడ్ ఫండ్లలో పెట్టుబ‌డి చేయ‌డం మంచిది. చాలా మంది ఆర్థిక స‌ల‌హాదారులు అత్య‌వ‌స‌ర నిధికోసం లిక్విడ్ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయాల‌ని సూచిస్తుంటారు. దీనికి కార‌ణం ఈ ఫండ్ల యూనిట్ల‌ను ఒక్క‌రోజులోనే న‌గ‌దు రూపంలో మార్చుకునేందుకు వీలుంటుంది. దీంతో పాటు సేవింగ్స్ బ్యాంకు ఖాతా పై వ‌చ్చే వ‌డ్డీతో పోలిస్తే ఎక్కువ రాబ‌డి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని