Foxconn: ఏప్రిల్ నుంచి కర్ణాటక కొత్త ప్లాంట్‌లో ఐఫోన్ల తయారీ: మంత్రి పాటిల్
Foxconn: బెంగళూరు సమీపంలో ఫాక్స్‌కాన్ కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన పనులు వేగవంతమవుతున్నాయని మంత్రి పాటిల్ తెలిపారు. కావాల్సిన సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.
బెంగళూరు: టెక్ దిగ్గజం యాపిల్ (Apple)కు కాంట్రాక్ట్ తయారీ సంస్థగా ఉన్న ఫాక్స్‌కాన్ (Foxconn) వచ్చే ఏడాది నుంచి కర్ణాటకలో ఐఫోన్ల (iPhones) తయారీని చేపట్టబోతోందని మంత్రి ఎం.బి.పాటిల్ తెలిపారు. దేహణహళ్లిలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన తయారీ యూనిట్‌లో 2024 ఏప్రిల్ నాటికి కార్యకలాపాలు ప్రారంభించేందుకు కంపెనీ ప్రణాళికలు రచించినట్లు వెల్లడించారు. ఫాక్స్‌కాన్ (Foxconn) ప్రతినిధులతో గురువారం భేటీ అయిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. సమావేశంలో ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే కూడా పాల్గొన్నారు.
రూ.13,600 కోట్లకు సంబంధించిన ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వం వేగవంతం చేసినట్లు కర్ణాటక భారీ, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి పాటిల్ వెల్లడించారు. దేవణహళ్లిలోని ఐటీఐఆర్ (Information Technology Investment Region) ప్రాంతంలోని 300 ఎకరాల స్థలాన్ని 2023 జులై 1 నాటికి ఫాక్స్‌కాన్ (Foxconn)కు అప్పజెబుతామని పేర్కొన్నారు. అలాగే ప్రతిరోజు 50 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తామన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా, రోడ్లు సహా ఇతర మౌలిక వసతులను కల్పిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కొత్తగా 50 వేల మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.
కంపెనీలో పనిచేయడానికి ఉద్యోగులకు కావాల్సిన నైపుణ్యాలు ఏమిటో కూడా తెలియజేయాలని ఫాక్స్‌కాన్ (Foxconn)ను కోరినట్లు పాటిల్ తెలిపారు. తద్వారా ఆయా నైపుణ్యాలపై శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. స్థలానికి చెల్లించాల్సిన ధరలో 30 శాతం ఇప్పటికే ప్రభుత్వానికి కంపెనీ చెల్లించినట్లు అధికారిక ప్రకటన తెలియజేసింది. మూడు దశల్లో ఈ ప్రాజెక్టును ఫాక్స్‌కాన్ (Foxconn) పూర్తిచేయనుంది. అన్ని దశలు పూర్తయితే, ఏటా ఈ ప్లాంట్ నుంచి రెండు కోట్ల ఫోన్లు తయారవుతాయని అంచనా.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!