Aadhaar Update: ఆధార్‌ అప్‌డేట్‌ చేశారా? ఫ్రీ ఇంకొన్ని రోజులే!

Aadhaar Update: ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు ముగుస్తోంది. ఇంకా అప్‌డేట్‌ చేయకపోతే వెంటనే చేసేయండి.

Updated : 01 Sep 2023 14:13 IST

 

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆధార్‌ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు కేంద్రం ఇచ్చిన గడువు తొందరలో ముగియనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ’ (UIDAI) మార్చి 15 నుంచి ఉచితంగా అప్‌డేట్‌ చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. అయితే ఈ గడువును అనేక మార్లు పొడిగించింది. ఈ ప్రక్రియ 2023 సెప్టెంబరు 14తో ముగియనుంది. దీంతో ఆధార్‌ కార్డులో  చిరునామా మార్పులు చేసుకోవాలనుకొనేవారు వెంటనే ఆన్‌లైన్‌లో ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి. ఉచితం గడువు ముగిశాక మునుపటిలాగే ఆధార్‌ కేంద్రాల్లో రూ.50 చెల్లించి అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అప్‌డేట్‌ సులువుగా ఇలా..

  • దీని కోసం ఉడాయ్ పోర్టల్‌ (https://myaadhaar.uidai.gov.in/)లో ఆధార్‌ నంబర్‌ ద్వారా లాగిన్ కావాలి.   
  •  ‘Proceed to update address’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయగానే మీ ఆధార్‌ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. 
  •  దాన్ని ఎంటర్‌ చేసిన తర్వాత ‘Document update’పై క్లిక్‌ చేయాలి. అప్పటికే ఉన్న వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఒకవేళ వీటిలో సవరణ ఉంటే చేసేయాలి. లేదా ఉన్న వివరాలను వెరిఫై చేసుకొని ‘Next’ పై క్లిక్‌ చేయాలి.
  •  తర్వాత కనిపించే డ్రాప్‌డౌన్‌ లిస్ట్‌ నుంచి ‘Proof of identity, proof of address’ డాక్యుమెంట్లను ఎంచుకోవాలి. 
  •  ఆయా డాక్యుమెంట్ల స్కాన్డ్‌ కాపీలను అప్‌లోడ్‌ చేసి ‘Submit’ పై క్లిక్‌ చేయాలి. 
  •  14 అంకెల ‘Update request number’ వస్తుంది. దీని ద్వారా అప్‌డేట్‌ స్టేటస్‌ ఎక్కడి వరకు వచ్చిందో ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని