మ్యూచువ‌ల్ ఫండ్ సిప్‌తో రూ.50 ల‌క్ష‌ల బీమా ఉచితం

ఈ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ తో యూలిప్‌ల‌ కంటే మంచి రాబ‌డి పొందే అవ‌కాశం ఉంటుంది​​​​​​....​

Published : 21 Dec 2020 13:13 IST

ఈ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ తో యూలిప్‌ల‌ కంటే మంచి రాబ‌డి పొందే అవ‌కాశం ఉంటుంది​​​​​​​

15 జూన్ 2018 మధ్యాహ్నం 2:50

సిప్ ద్వారా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో మ‌దుపు చేయ‌డం మ‌న‌కు తెలిసిందే. అయితే ఇప్పుడు మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో సిప్ ద్వారా పెట్టుబ‌డి చేసే మ‌దుప‌ర్ల‌కు కొన్ని సంస్థ‌లు జీవిత బీమా పాల‌సీల‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఇదెలా అంటే, సిప్ ద్వారా చెల్లించే మొత్తానికి 10 రెట్లు హామీ మొత్తం ఉండేలా జీవిత బీమా పాల‌సీల‌ను రిల‌య‌న్స్, ఐసీఐసీఐ, ఆదిత్యా బిర్లా ఏఎమ్‌సీల‌కు చెందిన ప‌థ‌కాల‌పై ప్ర‌స్తుతం అందిస్తున్నాయి. ఐసీఐసీఐ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఈ స‌దుపాయాన్ని సిప్ ప్ల‌స్ పేరుతో, రిల‌య‌న్స్ ఏఎమ్‌సీ సిప్ ఇన్స్యూర్ పేరుతో, ఆదిత్యా బిర్లా సంస్థ సెంచ్యూరీ సిప్ పేరుతో అందిస్తుంది. ఈ స‌దుపాయం ఆయా సంస్థ‌లు పేర్కొన్న వాటిపై మాత్ర‌మే ఉంటుంది. రిల‌య‌న్స్ ఏఎమ్‌సీ అందించే అన్ని ఈక్విటీ, హైబ్రిడ్ ఫండ్ల‌పై అందిస్తుంది. తొలి సంవ‌త్స‌రం పాటు సిప్ మొత్తానికి 10 రెట్లు హామీ మొత్తానికి జీవితబీమా ల‌భిస్తుంది. రెండో సంవ‌త్స‌రం ఇది సిప్ మొత్తానికి 50 రెట్లు అవుతుంది. మూడో సంవ‌త్స‌రం ఇది 100 రెట్ల‌కు పెరుగుతుంది.ప్ర‌స్తుతం ఈ విధానంలో పెట్టుబ‌డి చేసిన మ‌దుప‌ర్ల‌కు బీమా గ‌రిష్టంగా రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కూ అందుతుంది. గ‌తంలో ఇది త‌క్కువ‌గా ఉండేది. మొత్తం హామీ మొత్తం చూస్తే ఐసీఐసీఐ రూ.21 ల‌క్ష‌ల‌కు గ‌రిష్ట ప‌రిమితి పెట్ట‌గా, ప్ర‌స్తుతం ఇది రూ.50 ల‌క్ష‌ల‌కు పెంచింది. ఆదిత్యా బిర్లా ఈ మొత్తాన్ని రూ.25 ల‌క్ష‌ల‌కు , ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మ్యూచువ‌ల్ ఫండ్ల రూ. 50 ల‌క్ష‌లు అందిస్తుంది.

ఎవ‌రు తీసుకోవ‌చ్చు?

ఈ ఫండ్ల‌లో పెట్టుబ‌డి చేయ‌డం ద్వారా ఉచిత బీమా స‌దుపాయాన్ని పొందేందుకు పెట్టుబ‌డి చేసి వ్య‌క్తి వ‌య‌సు 18-51 సంవ‌త్స‌రాల మ‌ధ్య‌ ఉండాలి. ఉచిత బీమాను పొందేందుకు మ‌దుప‌ర్లు సిప్ మొత్తాన్ని ప్ర‌తీ నెలా క్ర‌మం త‌ప్ప‌కుండా చెల్లించాలి. సిప్ మ‌ధ్య‌లో ఆపేస్తే బీమా ర‌ద్దు అవుతుంది.

మ‌ధ్య‌లో ఆపితే బీమా ర‌ద్దే:

బీమా స‌దుప‌యం 45 రోజుల వెయిటింగ్ పిరియ‌డ్ తో ఉంటుంది. అంటే సిప్ చెల్లించిన 45 రోజుల త‌ర్వాత ఈ బీమా అమ‌లులోకి వ‌స్తుంది. ప్ర‌మాదం సంభ‌వించిన‌పుడు వెయిటింగ్ పిరియ‌డ్ నిబంధ‌న వ‌ర్తించ‌దు. రిల‌య‌న్స్ ఐసీఐసీఐ మ‌దుప‌రి వ‌య‌సు 55 సంవ‌త్స‌రాల వ‌ర‌కూ మాత్ర‌మే ల‌భిస్తుంది. ఆదిత్యా బిర్లా 60 ఏళ్ల వ‌ర‌కూ ల‌భిస్తుంది.సిప్ చేయాల్సిన క‌నీస కాల‌ప‌రిమితి మూడు సంవ‌త్స‌రాలు. మ‌దుప‌ర్లు మూడేళ్ల కంటే ప‌ముందే సిప్ ను క‌ట్ట‌డం ఆపేస్తే బీమా స‌దుపాయం ర‌ద్దు అవుతుంది. మూడేళ్లు క్ర‌మం త‌ప్ప‌కుండా సిప్ చెల్లించిన‌ట్ట‌యితే ఆ మ‌దుప‌ర్ల‌కు అనంత‌రం కూడా బీమా స‌దుపాయం నిర్ణీత మొత్తానికి కొన‌సాగుతుంది. సిప్ ద్వారా మ‌దుపు చేసిన మొత్తాన్ని పూర్తిగా గానీ పాక్షికంగా గానీ మ‌ధ్య‌లో ఉపసంహ‌రిస్తే బీమా స‌దుపాయం ర‌ద్దు అవుతుంది. ఈ విష‌యంలో ఆదిత్య‌బిర్లా రిల‌య‌న్స్ నాలుగు సిప్‌లు వ‌రుస‌గా, ఐసీఐసీఐ ఐదు సిప్‌లు వ‌రుస‌గా చెల్లించ‌క‌పోతే జీవిత‌బీమా స‌దుపాయం ఆగిపోతుంది.

లోడ్ ఛార్జీలు:

ఈ త‌ర‌హాలో పెట్టుబ‌డి చేసే ఫండ్ల‌కు లోడ్ ఛార్జీలు వ‌ర్తిస్తాయి. ఏడాదికి మందే యూనిట్ల‌ను ఉప‌సంహ‌రిస్తే సాధార‌ణంగా లోడ్ ఛార్జీలు 1 శాతం ఉంటాయి. ఆదిత్య బిర్లా సెంచ్యూరీ సిప్ అయితే ఏడాదికి ముందే యూనిట్ల‌ను విక్ర‌యిస్తే 2 శాతం. ఒక ఏడాది నుంచి మూడేళ్ల మ‌ధ్య‌కాలంలో ఉప‌సంహ‌రిస్తే 1 శాతం లోడ్ ఛార్జీల‌ను వ‌సూలు చేస్తున్నాయి.

సిప్ ప్ర‌కారం వ‌చ్చే బీమా హామీ మొత్తం రిల‌య‌న్స్ ఫండ్ల‌లో అధిక మొత్తంలో ఉంటుంది. విలువ ప‌రంగా చూస్తే ఐసీఐసీఐ ప్రుడెన్షియ‌ల్ మంచిద‌ని చెప్పాలి. ఇది మిగిలిన రెండింటి కంటే దాదాపు రెట్టింపు ప్ర‌యోజ‌నాన్ని చేకూరుస్తుంది. వీటిలో వ‌చ్చే బీమా హామీ మొత్తం ఫోలియో ఖాతాలో ఉమ్మ‌డి ఖాతాదారులంద‌నిరీ బీమా మొత్తం ల‌భించ‌దు. ప్ర‌ధాన ఖాతాదారునికి మాత్ర‌మే అందుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని